SSMB 29: మహేష్ జక్కన్న కాంబినేషన్ సినిమాలో ఆ నటుడికి ఛాన్స్ దక్కిందా?

మహేష్ బాబు జక్కన్న కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రలో మోహన్ లాల్ నటించనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. మోహన్ లాల్ అంటే జక్కన్నకు ఎంతో అభిమానమని గతంలో తన డైరెక్షన్ లో తెరకెక్కిన పలు సినిమాల కోసం మోహన్ లాల్ కోసం రాజమౌళి సంప్రదించారని బోగట్టా.

అయితే ఆ సమయంలో మోహన్ లాల్ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల రాజమౌళి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే మోహన్ లాల్ డేట్స్ కోసం జక్కన్న ఇప్పటినుంచి సంప్రదిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ జక్కన్న కాంబో మూవీలో మోహన్ లాల్ కచ్చితంగా నటిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మహేష్ రాజమౌళి కాంబో మూవీలో ఇతర భాషలకు సంబంధించిన కీలక నటీనటులు కూడా నటిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండగా జక్కన్న ఆలోచనలు కూడా వేరే లెవెల్ లో ఉన్నాయని సమాచారం. ఈ జనరేషన్ ఆడియన్స్ కు కచ్చితంగా నచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

మహేష్ రాజమౌళి (SSMB 29) కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ బడ్జెట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది. ఈ బడ్జెట్ ఒకింత ఎక్కువ మొత్తం అయినా మహేష్ రాజమౌళిని నమ్మి నిర్మాతలు ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ అయితే రానున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus