పైన తథాస్తు దేవతలు ఉంటారు… మన ఏదైనా అనుకుంటే తథాస్తు అనేస్తారు అని మన పెద్దలు చెబుతుండేవారు. మీ ఇంట్లో కూడా ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు వినిపించే ఉంటాయి. అయితే ఓ రెండేళ్ల క్రితం ‘ఆర్‌ఆర్ఆర్’ ఫస్ట్ ప్రెస్ మీట్ సమయంలో ఆ తథాస్తు దేవతలు అక్కడే ఉన్నారా? ఏమో జరిగిన పనులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇదంతా దేని గురించా? అని అనుకోకండి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ డేట్ గురించే.
Click Here To Watch NEW Trailer
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కాన్సెప్ట్ చెప్పిన ప్రెస్ మీట్ అది. ఓసారి యూట్యూబ్‌లో చూసొస్తా అంటి.. చూసి రండి. ఏంటీ చూశారా… అర్థమైందా మేం దేని గురించి అంటున్నామో, ఆ ప్రెస్ కాకపోయినా, మొన్నీ మధ్య ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌ని సుమ చేసిన ఇంటర్వ్యూ చూసినా మీకు విషయం అర్థమైపోతుంది. అందులో కూడా ఈ విషయం మీద చర్చ జరిగింది. ‘బాహుబలి’ సినిమాకి చాలా రోజులు తీసుకొని విడుదల చేశారు కదా, ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’కి కూడా అంతేనా ఓ పాత్రికేయుడు అడిగితే…
దానికి రాజమౌళి స్పందిస్తూ… ‘2021, 2022 వరకు ఈ సినిమా వెళ్లదండీ… 2020లోనే సినిమా విడుదల చేసేస్తాం’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఓ మీమర్ మీమ్‌గా చేశారు. మీరూ చూసే ఉంటారు. ఆ మీమ్ గురించి రాజమౌళిని సుమ అడిగారు. ఆ రోజు అంత పక్కాగా 2022 అని ఎలా చెప్పారు, ఇప్పుడు చూడండి సినిమా 2022కి వచ్చేసింది అంటూ సుమ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. దానికి రాజమౌళి తనకు అలాంటి ఆలోచన ఏమీ లేదని, కరోనా కేసులు, ఇతర పరిస్థితుల వల్ల సినిమా షూటింగ్, విడుదల వాయిదా పడ్డాయని చెప్పారు.
దానికి రామ్ చరణ్, తారక్ అయితే తెగ నవ్వుకున్నారు. మీకు తెలిసే ఉంటుంది ఈ సినిమాకు ఇప్పటివరకు ఆరు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశారు. ఆఖరికి ఐదో డేట్‌కి సినిమా విడుదల అవుతోంది. అన్నట్లుగా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడానికి ప్రి రిలీజ్ ఈవెంట్ పెట్టారు. దానికి సుమ యాంకరింగ్ చేయలేదు. ఈ కారణంగానే సినిమా వాయిదా పడింది, నేను యాంకరింగ్ చేయకుండా, నాకు హోస్ట్ చేసే అవకాశం ఇవ్వకుండా… సినిమా ఎలా రిలీజ్ చేసేస్తారు అంటూ రాజమౌళిని సుమ సరదాగా అడిగి ఆటపట్టించారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!