RRR Movie: రాత్రికి రాత్రే మార్చేసి.. ఎడిట్ చేసిన జక్కన్న.!

బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించింది. ఇండియాలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డుకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఉగాది పండుగ సందర్భంగా ఈ వీకెండ్ కాస్త హాలిడేస్ ఉండడంతో మళ్ళీ చూసిన వాళ్లు కూడా సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు అని చెప్పవచ్చు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ అయితే దక్కుతోంది.

Click Here To Watch NOW

మొత్తానికి రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ నటన కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఓ వర్గం ప్రేక్షకులు నుంచి మాత్రం ఒక విషయంలో కొంత అసంతృప్తి రావడంతో దర్శకుడు రాజమౌళి రాత్రికి రాత్రి ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి మళ్ళీ కొత్తగా మార్చినట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రతి సీన్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే బ్రిటిష్ వారికి సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ పూర్తిగా ఇంగ్లీష్ లో ఉండడం మాస్ ఆడియన్స్ కు అర్థం కావడం లేదు.

సెకండాఫ్ లో రానా దగ్గుపాటి అలాగే నవదీప్ లతో ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇప్పించడం జరిగింది. కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం కొన్ని డైలాగ్స్ కు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. దీంతో దర్శకుడు రాజమౌళి వారి బాధను అర్థం చేసుకుని వెంటనే ఆ విషయంలో మార్పులు చేయడం జరిగిందట. ప్రతి ఒక్క ఇంగ్లీష్ వెర్షన్ డైలాగ్ కు వాయిస్ ఓవర్ ఉండేవిధంగా అందరికీ అర్థం కావాలి అని మళ్ళీ ఆడియోను చేసినట్లు రెడీ చేసినట్లు సమాచారం.

రాత్రికి రాత్రే మళ్లీ ఆ సెంటర్లకు వాయిస్ ఓవర్ ను పంపించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా దర్శకుడు రాజమౌళి మరోసారి తన పనితనం తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus