దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఫిక్షనల్ పీరియాడికల్ సినిమా ఇది. ‘బాహుబలి’ తరువాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు హీరోలు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 25న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
Click Here To Watch NEW Trailer
ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ప్రోమోలు, సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను మరో రేంజ్ కి తీసుకెళ్లాయి. తన సినిమా మేకింగ్ విషయంలో ప్రతీ చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా కేర్ తీసుకొని చేసే రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో అయితే మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారట. దానికి కారణం ఈ సినిమా ఒక ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా, అలానే ఇద్దరు హీరోలు నటిస్తున్న కథ కావడంతో ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్లేవారట.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని గమనిస్తే రామ్ చరణ్ గుర్రం మీద వెళితే.. ఎన్టీఆర్ బుల్లెట్ బండిపై వెళ్తుంటారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ ఉపయోగించిన బైక్ కి ఓ స్పెషాలిటీ ఉందట. ఎన్టీఆర్ వాడిన బైక్ గురించి రాజమౌళి చాలా రీసెర్చ్ చేశారట. బుల్లెట్ కంపెనీ పేరు వెలో సెట్ మోటార్ బైక్. బ్రిటన్‌కు చెందిన ఈ కంపెనీ హెడ్ ఆఫీసు బర్మింగ్ హామ్‌లో ఉంది. 1920 నుంచి 1950 వరకు అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో టాప్‌గా ఉండేది.
350 సీసీ, 500 సీసీ బైకులను తయారు చేసింది. 1971లో ఈ కంపెనీ బైకుల ఉత్పత్తిని ఆపేసింది. ‘ఆర్ఆర్ ఆర్’ కోసం ఎన్టీఆర్‌కు బైక్ కావాలనుకున్నప్పుడు రాజమౌళి చాలా రీసెర్చ్ చేసి.. ఇప్పుడున్న మోటార్ బైక్ కి అప్పటి మోడల్ లో కనిపించేలా దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ మార్పులు, చేర్పులు చేశారట. అదన్నమాట సంగతి!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!