రజనీకాంత్ అభిమానులకు ఈ రోజు పండగ రోజు. ఇప్పటికే దేశ ఉన్నత పురస్కారాల్లో రెండింటిని పొందిన రజనీకాంత్.. ఇప్పుడు మూడో పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. సినీ పరిశ్రమకు రజనీకాంత్ అందించిన సేవలను గుర్తిస్తూ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారంతో సత్కరించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. దాదా సాహెబ్ పురస్కారాల్లో ఇది 51వది కావడం విశేషం.
భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్ (తెలుగు), నాగిరెడ్డి (తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు (తెలుగు), శివాజీ గణేషన్ (తమిళం), రాజ్‌కుమార్ (కన్నడ), గోపాలకృష్ణన్ (మలయాళం), రామానాయుడు (తెలుగు), బాలచందర్ (తెలుగు, తమిళం), కె. విశ్వనాథ్ (తెలుగు), అమితాబ్ బచ్చన్ (హిందీ) తదితరులు ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు.
రజనీకాంత్‌కు దాదాసాహెబ్ పురస్కారం దక్కడం పట్ల పలువురు చలనచిత్ర, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు ఎన్నికల వేళ ఈ పురస్కారాన్ని ప్రకటించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికే పద్మ భూషణ్, పద్మ విభూషణుడైన రజనీకాంత్… ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందడం అభిమానులకు ఆనందమే.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!