Annie: దత్తత తీసుకుంటాను అన్నారు… ఎదురుపడితే గుర్తుపట్టలేదు!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా కెరియర్ ప్రారంభించి అనంతరం హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి యానీ ఒకరు. రాజన్న సినిమాలో ఎంతో అద్భుతమైన నటనను కనపరచినటువంటి ఈ చిన్నారి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె తిరిగి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు.

తాజాగా ఈమె నటించిన లూజర్ అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఈ ప్రమోషన్లలో భాగంగా నాగార్జున గురించి పలు విషయాలు తెలియజేశారు. తాను పూర్తిస్థాయిలో సినిమాలలో ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇప్పటికి తాను డిగ్రీ వరకు పూర్తి చేశానని తెలియజేశారు.ఇక నాగార్జున గురించి మాట్లాడుతూ రాజన్న సినిమా సమయంలో నాగార్జున గారు నన్ను దత్తత తీసుకుంటానని చెప్పారు.

అయితే ఆయన ఇచ్చిన మాట మీద నిలబడలేదని నన్ను మోసం చేశారంటూ యానీ తెలియజేశారు. అలా దత్తత తీసుకుంటానని చెప్పినటువంటి నాగార్జున గారు గత కొద్ది రోజుల క్రితం తాను ఆయనని కలిసాను అయితే నన్ను చూసినటువంటి నాగార్జున కనీసం నన్ను గుర్తు కూడా పట్టలేదని ఈమె తెలిపారు. చాలా సేపటి తర్వాత ఆయన నన్ను గుర్తుపట్టి తిరిగి వచ్చి నన్ను పలకరించారని అప్పుడు హ్యాపీగా అనిపించిందని యానీ తెలియజేశారు.

ఇక తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి కూడా ఈమె మాట్లాడుతూ నాకు నా రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం గుర్తు లేదని తెలిపారు. తాను అనుకోకుండా ఒక రోజు సినిమా కంటే ముందుగా ఒక యాడ్లో నటించాను. దానికోసం నాకు కొంత డబ్బు ఇచ్చారు. అయితే ఎంత ఇచ్చారు అని ఒక సందర్భంలో అమ్మని అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చారని సమాధానం చెప్పారు. అదేనా ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటూ యానీ (Annie) తెలిపారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus