Rajasekhar, Jagapathi Babu: జగపతి ఖాతాలో మరో సక్సెస్ చేరినట్టేనా?

గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శ్రీవాస్ గోపీచంద్ కు కథ చెప్పి కొన్ని నెలల క్రితమే ఓకే చేయించుకున్నారు. మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమాలో మరో పాత్రకు హీరో రాజశేఖర్ ఎంపికయ్యారు.

Click Here To Watch

అయితే కొన్ని కారణాల వల్ల రాజశేఖర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. రాజశేఖర్ స్థానంలో ఎవరు నటిస్తారనే ప్రశ్నకు చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపించాయి. అయితే ఈ పాత్రకు జగపతిబాబు ఎంపికైనట్టు అధికారిక ప్రకటన వెలువడింది. రాజశేఖర్ రిజెక్ట్ చేసిన పాత్రకు జగపతిబాబు ఓకే చెప్పడం గమనార్హం. శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన లక్ష్యం సినిమాలో గోపీచంద్, జగపతిబాబు కలిసి నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది.

అదే కాంబినేషన్ లో సినిమా కావడంతో ఈ సినిమాతో అటు గోపీచంద్ ఖాతాలో ఇటు జగపతిబాబు ఖాతాలో మరో సక్సెస్ చేరినట్టేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు వరుసగా పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తూ విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు. బోయపాటి శ్రీను జగపతి బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. అఖండ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకున్న జగపతిబాబు విలన్ రోల్స్ తో పాటు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలలో కూడా నటిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్లు సైతం జగపతిబాబుకు విభిన్నమైన పాత్రలను ఆఫర్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. గత కొన్నేళ్లలో జగపతిబాబు రెమ్యునరేషన్ కూడా ఊహించని స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్లలో జగపతిబాబు ఒకరు. ఇతర ఇండస్ట్రీలలో కూడా జగపతిబాబుకు సినిమా ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus