Rajasekhar: స్పెషల్ రోల్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజశేఖర్!

టాలీవుడ్ హీరోలలో ఒకరైన రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేఖర్ మూవీ ఈ నెల 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని రాజశేఖర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రాజశేఖర్, జీవిత ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.

అయితే కొన్నిరోజుల క్రితం రాజశేఖర్ ఒక సినిమాలో స్పెషల్ రోల్ లో నటించనున్నారని ప్రచారం జరగగా ఆ తర్వాత రాజశేఖర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. శేఖర్ ప్రమోషన్స్ లో భాగంగా రాజశేఖర్ మాట్లాడుతూ నేను ప్రత్యేక పాత్రలు చేస్తానా లేదా అని చాలామందికి సందేహం అని తాను స్పెషల్ రోల్స్ కు సంబంధించిన కథలు వింటాను కానీ చేయనని చాలామంది అనుకుంటారని ఆయన కామెంట్లు చేశారు.

మంచి క్యారెక్టర్స్ చెప్పకపోవడం వల్లే తాను చేయడం లేదని ఈ పద్ధతి ఇలానే ఉంటే నేనేం చేయలేనని పద్ధతిని మార్చే పాత్ర రావాలని అలాంటి పాత్ర రావాలని కోరుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు. ఇష్టం లేకుండా సినిమాలలో నటిస్తే బాగుండదని అందుకే తాను తక్కువ సినిమాలలో నటిస్తున్నానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. తనతో ప్రత్యేక పాత్రలు చేయించాలనుకునే దర్శకులు తన ఇమేజ్ ను వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని రాజశేఖర్ తెలిపారు.

ధృవ సినిమాలో అరవింద స్వామి తరహా రోల్ వస్తే తాను ఎందుకు నో చెబుతానని రాజశేఖర్ కామెంట్లు చేశారు. హీరో రాజశేఖర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. శేఖర్ సినిమా సక్సెస్ సాధిస్తే రాజశేఖర్ మరిన్ని కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రముఖ ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా మేకర్స్ మాత్రం ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపడం గమనార్హం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus