Rajashekar: కొవిడ్‌ వచ్చినప్పటి రోజుల గురించి రాజశేఖర్‌ ఏమన్నారంటే?

  • May 21, 2022 / 12:56 PM IST

కరోనాతో ఇబ్బందిపడని వాళ్లు ఎవ్వరూ లేరు. అయితే కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు. జీవితంలో అలాంటి కష్టం ఎప్పుడూ చూడలేదు, చూడలేదు అని చెబుతుంటారు ఆ ఇబ్బంది పడ్డవాళ్లు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు రాజశేఖర్‌ ఒకరు. కరోనా సోకి.. ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. వైద్యుల కృషి కారణంగానే తాను కరోనా కోరల నుండి బయట పడ్డానని కూడా చెప్పారాయన. అయితే కరోనా సమయంలో ఆయన ఎలా ఉన్నారు, ఎలా బయటపడ్డారు అనే విషయాలను ఇటీవల చెప్పారు రాజశేఖర్‌.

‘‘కొవిడ్‌ సోకినప్పుడు నాకు చాలా సీరియస్‌ అయింది. నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను . బోర్‌ కొట్టకుండా ఉండేందుకు ఐసీయూలో టీవీ ఏర్పాటు చేయించారు. హీరోలు చేసే డ్యాన్స్‌, పోరాటాలు చూసి నేనూ అలానే ఉండేవాడ్ని కదా… ఇలా అయిపోయానేంటి అని బాధపడేవాణ్ని. ఇక నా జీవితం ముగిసిపోతోందనే భయం కూడా వేసింది. అదే సమయంలో మా అక్క ఫోన్‌ చేస్తే విషయం చెప్పి ఏడ్చేశా’’ అని చెప్పారు రాజశేఖర్‌.

ఇక మునపటిలా ఉంటాననే నమ్మకం తగ్గిపోవడంతో ‘జోసెఫ్‌’ సినిమా హక్కులను ఎవరికైనా ఇచ్చేయమని జీవితకు చెప్పారట రాజశేఖర్‌. అయితే రాజశేఖర్‌ కోలుకుంటానని ధైర్యానిచ్చారట జీవిత. ఆమె, పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే తిరిగి మామూలు స్థితికి చేరుకున్నారట రాజశేఖర్‌. వారి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేను అని కూడా చెప్పారు. ఎలా అయినా ఈ సినిమా చేయాలనే కసితో మళ్లీ మామూలు మనిషిని అయ్యా అని చెప్పుకొచ్చారు.

ఎప్పుడూలేనిది ఈ సినిమాను బతికించండని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎందుకు అన్నారు అని రాజశేఖర్‌ను అడగ్గా… ఇంతకాలం నా దగ్గర ప్రాపర్టీ ఉంది. ప్రస్తుతం అప్పుల్లో ఉన్నా. ఈ సినిమా విజయం అందుకుంటేనే వాటి నుంచి బయటపడగలను. అందుకే ఆ రోజు వేదికపై అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పారు. ఓ మంచి, విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాం అని చెప్పారు. అనుకున్నట్లుగానే సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. అయితే ఎంతవరకు టాక్‌ నిలబడుతుంది అనేది చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus