పాపం.. శ్రీహరి కొడుకు.. నిజంగా అన్యాయమే..!

ఇప్పట్లో ఓ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తేనే కానీ జనాలు థియేటర్లకు రావడం లేదు. ఎలాగు నెల రోజుల్లో ‘అమెజాన్ ప్రైమ్’ లోకి వచ్చేస్తుంది కదా అని ప్రేక్షకులు కొన్ని హిట్టు సినిమాల్ని కూడా లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 60 రోజుల తర్వాతనే డిజిటల్ రిలీజ్… చేయాలని టాలీవుడ్ నిర్మాతలు కోరినా…. అది సాధ్యం కావడం లేదు. 60 రోజుల లోపు సినిమా డిజిటల్ లో రిలీజవ్వడం సరికాదని వారు కోరారు. కానీ అది పూర్తి స్థాయిలో అమలు కాలేదని.. ఇప్పుడు స్పష్టమైంది. ఇలా రిలీజయ్యిందో లేదో అలా ఆన్ లైన్ లో వచ్చేసింది ఓ కుర్ర హీరో సినిమా.

అసలు విషయం ఏమిటంటే.. దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంశ్ నటించిన `రాజ్ దూత్` చిత్రం జూలై 12 న విడుదలైంది. అంటే సరిగ్గా 2 వరాలు కూడా పూర్తవ్వలేదు. అప్పుడే ‘అమెజాన్ ప్రైమ్లో’ ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేసేస్తున్నారు. శ్రీహరి కొడుకైనప్పటికీ.. ప్రస్తుతం శ్రీహరి లేకపోవడం… ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయకపోవడంతో.. మేఘాంశ్ మొదటి చిత్రాన్ని పట్టించుకునే వారే లేరు. అయితే నిర్మాతలు కోరింది కేవలం హిట్టు సినిమాలకి మాత్రమేనా అనే అనుమానాలు కూడా ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags