Suma,Rajeev Kanakala: నాతో పెళ్లికి సుమ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు… ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన రాజీవ్!

రాజీవ్ కనకాల పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఈయన ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక ఈయన సతీమణి యాంకర్ సుమ గురించి అసలు పరిచయం అవసరమే లేదు. హీరోయిన్ల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని అదే స్థాయిలో ఈమె సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇండస్ట్రీకి సంబంధించి ఏ సినిమా ఈవెంట్ జరిగిన అక్కడ తప్పకుండా సుమా ఉండాల్సిందే. ఈ విధంగా సుమ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా తన భర్త రాజీవ్ కనకాల కూడా నటుడుగా అదే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.

ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ గుర్తింపు పొందారు. అయితే ఇన్ని రోజులు ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉండేది ఏ సినిమాలో అయితే రాజీవ్ కనకాల పాత్ర చనిపోతుందో ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ అందరికీ ఉండేది. ఇకపోతే తాజాగా ఈయన నటించిన విరూపాక్ష సినిమాలో రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించారు.

ఇందులో ఈయన పాత్ర చనిపోదు కానీ ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆ సెంటిమెంట్ కాస్త బ్రేక్ అయింది. ఇక తాజాగా రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో భాగ్ సాలె అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సినిమాకు సుమ యాంకర్ గా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమతో తన పెళ్లి గురించి రాజీవ్ కనకాల చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ (Suma) సుమను తాను ప్రేమించే పెళ్లి చేసుకోవాలని భావించాను అయితే తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో తనను లేపుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీఆ తర్వాత సుమా పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకోవడంతో నాకు అవసరం రాలేదు అంటూ ఈ సందర్భంగా రాజీవ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus