Rajendra Prasad: ఆ సినిమా తర్వాత నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను : రాజేంద్రప్రసాద్!

నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)  ఏం మాట్లాడినా సంచలనం అవుతుంటుంది. మొన్నామధ్య ‘గంధపు చెక్కల దొంగ వాడు హీరో’ అంటూ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తర్వాత ‘రాబిన్ హుడ్'(Robinhood)  ప్రమోషన్స్ లో క్రికెటర్ ‘డేవిడ్ వార్నర్ ను దొంగ ము*డా కొడుకు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈరోజు ఆయన ‘షష్టిపూర్తి’ సినిమా ప్రెస్ మీట్ జరిగింది.

Rajendra Prasad

అయితే ఈసారి కూడా రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్ అయ్యాయి కానీ వివాదాలకు దారి తీయలేదు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…”రజినీకాంత్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ వంటి ఎంతో మందిని తన మ్యూజిక్ తో హీరోగా నిలబెట్టింది ఇళయరాజా గారు.’ప్రేమించు పెళ్ళాడు’ సినిమా తర్వాత నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను. దానికి ముందు డబ్బింగ్ చెప్పేవాడిని. డబ్బులు వచ్చేవి. డబ్బింగ్ తో వచ్చిన సంపాదనతో మద్రాసులో ఇల్లు కట్టాను.

‘ప్రేమించి పెళ్ళాడు’ తో యాక్టింగ్ మొదలుపెట్టాను. ఆ సినిమా ఆడలేదు. హీరో అయినా ఏమీ కాలేకపోయాను. ‘డు ఆర్ డై’ అనే టైంలో ‘లేడీస్ టైలర్’ చేశాను. అది కనుక ఆడకపోతే దండేసి దణ్ణం పెట్టేవాళ్ళు ఈపాటికి. సో రాజేంద్రప్రసాద్ లేడు ఆ సినిమా కనుక లేకపోతే. ఆ సినిమా ఆడటానికి, జనాలు రిసీవ్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఇళయరాజా మ్యూజిక్” అంటూ తన శైలిలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus