వ్యకిగత విషయాన్నీ చెప్పి ఏడిపించిన రాజేంద్ర ప్రసాద్

నట కిరీటి రాజేంద్రప్రసాద్ హాస్య టానిక్ లాంటి సినిమాలు ఇచ్చారు. అలాగే ఆలోచింపజేసే మీ శ్రేయోభిలాషి.. ఆ నలుగురు లాంటి సినిమాలు ఇచ్చారు. ఎమోషనల్ సన్నివేశాల్లో కంటతడి పెట్టించారు. అతను ఏ వేడుకకి వెళ్లినా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. కానీ తొలిసారి వేదికపై ఎమోషనల్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్ర ప్రసాద్ ప్రధానపాత్రలో తెరకెక్కిన మూవీ బేవర్స్. సంజోష్‌, హ‌ర్షిత హీరో హీరోయిన్లుగా ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ అక్టోబ‌ర్ 12న రిలీజ్ కానుంది. సునీల్ కశ్య‌ప్ సమకూర్చిన పాటలను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ వేడుకలో రాజేంద్ర ప్రసాద్ వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. “తల్లి లేనోడు తన తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడు. పదో ఏటనే నా అమ్మ చనిపోయింది. ఆమెను నా కుమార్తె గాయత్రిలోనే చూసుకునే వాణ్ణి.

అయితే ఇప్పుడు ఆమెతో నేను మాట్లాడను. ఎందుకంటే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్లిపోయింది. ఇవన్నీ మామూలు విషయాలే అయినా.. ఈ సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ రాసిన పాట విన్నాక మాత్రం నా కుమార్తెను ఇంటికి పిలిపించి.. ఈ పాటను నాలుగైదుసార్లు వినిపించాను. నా తల్లి చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. కానీ కూతురు వెళ్లిపోయినప్పుడు మాత్రం ఏడ్చాను. “తల్లీ తల్లీ చిట్టితల్లీ.. నా ప్రాణాలే పోయాయమ్మా” అంటూ సుద్దాల రాసిన ఈ పాట నాకెంతో నచ్చింది. నా కంటే చిన్నోడు కాబట్టి సుద్దాల కాళ్లకు దండం పెట్టలేదు” అని అన్నారు. ఎప్పుడూ వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించని రాజేంద్రప్రసాద్ భావోద్వేగానికి గురి కావటం అందరిని కంటతడి పెట్టించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus