Rajinikanth: రజనీ కొత్త సినిమా అప్‌డేట్‌ చెప్పిన లోకేశ్‌… ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

సౌత్‌ సినిమాలో ముఖ్యంగా తమిళనాట సినిమా ఫ్యాన్స్‌ ఏదైనా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే అది కచ్చితంగా రజనీకాంత్ (Rajinikanth) 171వ సినిమానే అయి ఉంటుంది. రజనీ ఫ్యాన్స్‌ అంటే ఓకే… మొత్తం అందరి ఫ్యాన్స్‌ ఎందుకు అంతగా ఎదురుచూస్తారు అనే డౌట్‌ మీకు రావొచ్చు. మామూలుగా అయితే తలైవా ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తారు. కానీ ఈ సినిమాతో కోలీవుడ్‌ ఇతర స్టార్‌ హీరోల సినిమాలకు లింక్‌ ఉంటుంది అని సమాచారం వస్తోంది కాబట్టి.

రజనీకాంత్‌ తన 171వ సినిమాను యువ స్టార్‌ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు (Lokesh Kanagaraj)  చేస్తున్న విషయం తెలిసిందే. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎల్‌సీయూ)లో ఈ సినిమా రూపొందుతుంది అని అంటున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచంలో వచ్చిన ‘ఖైదీ’ (Kaithi) , ‘విక్రమ్‌’ (Vikram) , ‘లియో’ (LEO)… త్వరలో తెరకెక్కబోయే ‘ఖైదీ 2’, ‘రోలెక్స్‌’ ఇలా చాలా సినిమాలు ఈ సినిమాకు లింక్‌గా ఉంటాయి అని చెబుతున్నారు. దీంతో అసలు ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు అనే ఆతృత సినిమా జనాల్లో ఉంది.

ఈ సినిమాలో ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, ఎల్‌సీయూలోకి రజనీకాంత్‌ ఎప్పుడు వస్తారు అనే విషయం తేలిపోయింది. ప్రస్తుతం టి.జె.జ్ఞానవేల్‌ (TJ Gnanavel) దర్శకత్వంలో తన 170వ చిత్రం చేస్తున్న 171వ సినిమాను జూన్‌లో స్టార్ట్‌ చేస్తారట. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్‌ కనగరాజ్ ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందని, దీని కోసం ఆరు నెలలుపైగా సమయం పడుతుందని చెప్పారు. దీంతో రజనీ ఫ్యాన్స్‌ యమా ఖుష్‌ అవుతున్నారు.

ఇక రజనీకాంత్‌తో సినిమా పూర్తయిన వెంటనే ‘ఖైదీ 2’ సినిమాను స్టార్ట్‌ చేస్తానని లోకేశ్‌ తెలిపారు. నెల రోజులకే సినిమా స్టార్ట్‌ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారాయన. అంటే ఈ సినిమా కథ, ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఈపాటికే ఓ కొలిక్కి వచ్చాయని అర్థం చేసుకోవచ్చు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus