తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తనను రాజకీయాల్లోకి రావాలంటూ బలవంత పెట్టొద్దంటూ ప్రకటించారు. కొన్నాళ్లక్రితం తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు, సొంతంగా పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పారు రజినీకాంత్. కానీ ఆయన అనారోగ్యానికి గురి కావడంతో తన రాజకీయ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం రాజకీయాల్లోకి రావాలంటూ ఆదివారం నాడు ఓ ర్యాలీను నిర్వహించారు. చెన్నైలో దాదాపు రెండు వేల మందికి పైగా రజినీ అభిమానులు ఒకచోటుకి చేరి ఆయన వచ్చే అసెంబీ ఎన్నికల్లో పోటీ చేయాలని నినాదాలు చేశారు.
రజినీకాంత్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. వారి నినాదాలతో చెన్నై నగరం మారు మ్రోగింది. దీంతో రజినీకాంత్ స్పందించక తప్పలేదు. ఈ మేరకు సోమవారం నాడు అభిమానులకు ఓ లేఖ రాశారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రాలేనని.. దయచేసి తన నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. రాజకీయ పార్టీను ప్రారంభించాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించడం వంటివి చేయొద్దని లేఖలో పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ప్రసక్తే లేదని.. కాబట్టి తననెవరూ ఇబ్బంది పెట్టొద్దని ఆయన వేడుకున్నారు. దయచేసి ఇంకెవ్వరూ తనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించి ఇబ్బంది పెట్టొద్దని కోరారు.
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!