Rajinikanth: మా మధ్య పోటీనా? అది మర్యాద కాదు… క్లారిటీ ఇచ్చేసిన రజనీకాంత్‌!

సినిమా స్టార్‌ హీరోల మధ్య గొడవలు ఉండవు… వాళ్ల అభిమానుల మధ్యనే ఉంటాయి అంటుంటారు. నిజానికి హీరోల మధ్య ఎలాంటి డిఫరెన్స్‌లు ఉండవా అంటే… ఉంటాయి కానీ ఎక్కువ రోజులు ఉండవు, పెద్ద విషయాలు కూడా అవ్వవు అంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది కోలీవుడ్‌లో. ‘జైలర్‌’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో ‘బీస్ట్‌’ సినిమా రిజల్ట్‌ గురించి రజనీ మాట్లాడిన విషయాలే దీనికి కారణం. అయితే ఆ తర్వాత ఆ విషయంలో పెద్ద రచ్చే అయ్యింది. తాజాగా దీనిని రజనీ క్లియర్‌ చేసే ప్రయత్నం చేశాడు.

ప్రస్తుతం తమిళనాట రజనీకాంత్‌, విజయ్‌ అభిమానుల మధ్య ‘నువ్వా నేనా’ అనే పరిస్థితి ఏర్పడింది. చిన్న మాటల్ని పట్టుకుని పెద్ద విషయం చేస్తున్నారు మరి. రజనీ ఇప్పటివరకు విజయ్‌ను డైరెక్ట్‌గా ఏమీ అనలేదు. అలాగే విజ‌య్ కూడా ఏమీ అనలేదు. కానీ ఏవో మాటల్ని ఫ్యాన్స్‌ ఆపాదించుకుని చర్చకు దారితీసేలా చేస్తుంటారు. అలా ర‌జ‌నీ, విజ‌య్ మ‌ధ్య కోల్డ్ వార్ ఏర్పడే పరిస్థితి వచ్చింది. తాజాగా జరిగిన ‘లాల్ స‌లామ్‌’ సినిమా ప్రెస్‌ మీట్‌ఓల విజ‌య్‌తో పోటీ గురించి ర‌జ‌నీకాంత్ కీల‌క‌ కామెంట్లు చేశాడు.

విజ‌య్‌తో నాకు పోటీ లేదు. అయినా విజయ్ త‌న క‌ళ్ల‌ముందు పెరిగాడు. ఓసారి షూటింగ్ స‌మ‌యంలో 13 ఏళ్ల విజ‌య్‌ని చూశాను. అప్పుడు యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పాడు. అయితే ముందు చదువుపై శ్రద్ధపెట్టమని, ఆ త‌ర‌వాత న‌ట‌న వైపు రమ్మని స‌ల‌హా ఇచ్చాను. చెప్పిన‌ట్టే తన కష్టంతో విజ‌య్ పైస్థాయికి వచ్చాడు అని రజనీ అన్నారు. ఇక ‘జైల‌ర్‌’ సినిమా ఈవెంట్లో తాను చెప్పిన కాకి – డేగ క‌థ గురించి అభిమానులు త‌ప్పుగా అర్థం చేసుకొన్నార‌ని తలైవా క్లారిటీ ఇచ్చాడు.

ఆ రోజు విజ‌య్‌ని ఉద్దేశించి ఆ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌న్న రజనీ (Rajinikanth) మా మధ్య పోటీ ఉందని అందరూ అంటుంటే వినడానికి బాధగా ఉంది. అలా చెప్పడం అమర్యాద కూడా. అందుకే మమ్మల్ని పోల్చవద్దని ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేస్తున్నా అని రజనీ చెప్పుకొచ్చాడు. దీంతో త‌మ మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లూ లేవ‌ని రజనీ చెప్పినట్లయింది. కాబట్టి ఇకపై ర‌జ‌నీ, విజ‌య్ అభిమానులు లేనిపోని చర్చలు పెట్టుకుని రచ్చ చేస్తే అది ఆ హీరోల త‌ప్పు కాదు, ముమ్మాటికీ ఫ్యాన్స్ త‌ప్పే అని చెప్పొచ్చు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus