రజనీకాంత్… దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలో ఆయనకు ఫ్యాన్ కానివారెవరూ ఉండరు. ఆయన నటన, స్టైల్, లైఫ్ స్టైల్.. ఇలా ఒక్కటేంటి అన్నింటా ఆయన సూపర్. అంతటి సూపర్ స్టార్ ‘నేను సంతోషంగా లేను’ అని అన్నారు. అవును ఈ మాట అన్నది రజనీకాంతే. చెన్నైలో నిర్వహించిన ‘హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ థ్రూ క్రియ యోగా’ అనే కార్యక్రమంలో రజనీకాంత్ పై వ్యాఖ్యలు చేశారు. తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తలైవా.. ఆస్తులు, పేరు ప్రతిష్ఠలు ఉన్నప్పటికీ ఆనందంగా చెప్పుకొచ్చారు.
నటుడిగా ఎన్నో చిత్రాలు చేసినప్పటికీ ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే నాకు ఆత్మ సంతృప్తినిచ్చాయి అని చెప్పిన రజనీకాంత్ ఆ సినిమాలు విడుదలైన తర్వాతే ఆ ఇద్దరు సద్గురువుల గురించి అందరికీ తెలిసిందన్నారు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపించాయి. ఆ సినిమాలు చూసి ఇద్దరు అభిమానులు సన్యాసం స్వీకరించారు. కానీ నేను మాత్రం ఇంకా నటుడిగానే కొనసాగుతున్నాను అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు తలైవా.
చాలామంది అనుకుంటున్నట్లుగా హిమాలయాలు సాధారణమైన మంచు పర్వతాలు కావు. అక్కడ అద్భుత మూలికలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒకసారి తింటే వారంరోజులకి సరిపోయే శక్తి మనకు వస్తుంది. ఆరోగ్యం మనిషికి ఎంతో ముఖ్యమని గుర్తు చేసిన రజనీ మనం అనారోగ్యానికి గురైతే మనకు కావాల్సినవాళ్లు తట్టుకోలేరు అని చెప్పారు. ‘‘నా వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవితంలో ఎన్నో విజయాలు చూశాను. పేరు ప్రతిష్ఠలూ, డబ్బులు సంపాదించాను.
అయినా ఇప్పటికీ సిద్ధులకు ఉండే ప్రశాంతతలో పది శాతం కూడా నాకు లేదు’’ అని అన్నారు రజనీ. ఎందుకు లేవు అంటే.. నేను సంపాదించినవన్నీ అశాశ్వతమైనవి కాబట్టి అని రజనీకాంత్ వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా పరిశ్రమలో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రజనీకాంత్ తరహా మాటలు చెప్పడం గతంలోనూ జరిగింది. హిమాలయాలకు వెళ్లాలని, అక్కడ ఆనందమయ జీవితం సాగించాలని ఆయన ఎప్పటినుండో అంటూ ఉండేవారు. ఇప్పుడు మరోసారి అన్నారు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!