నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా… నైనిక కామెంట్స్ వైరల్!

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఈమెకు ఘనంగా సన్మానం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీనా కుమార్తె నైనిక తన తల్లి గురించి మాట్లాడుతూ ఉండగా ఆమె మాటలకు సూపర్ స్టార్ రజనీకాంత్ కంట తడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నైనిక మాట్లాడుతూ… అమ్మ నటిగా నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు తనకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఒక నటిగా నువ్వు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నావు. వృత్తిపరంగా నువ్వు హీరోయిన్ అయినప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మలా ప్రతిక్షణం నా జాగ్రత్తలు, బాగోగులు చూసుకుంటూ నా అవసరాలు తీరుస్తున్నావు.

ఒకసారి చిన్నప్పుడు నేను షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు నిన్ను చాలా భయపెట్టాను.. నన్ను క్షమించమ్మా అంటూ ఈ సందర్భంగా క్షమాపణలు కోరారు. ఇక నాన్న మరణంతో చీకటి పరిస్థితులు ఎదురయ్యాయి. నువ్వు మానసికంగా ఎంతో కుమిలిపోయావు. ఇకపై నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ నైనీక మాట్లాడారు. ఇలా నైనిక తన తల్లి గురించి మాట్లాడుతూ ఉండడంతో తన మాటలు విన్నటువంటి పలువురు కంటతడి పెట్టుకున్నారు.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం నైనిక మాటలకు ఎమోషనల్ అయ్యారు.ఇటీవల కాలంలో మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు గురించి కూడా నైనిక మాట్లాడుతూ అమ్మ గురించి ఈ మధ్యకాలంలో తప్పుడు వార్తలు వస్తున్నాయి… అమ్మ కేవలం నటి మాత్రమే కాదు తను కూడా మనిషే తనకు ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దు అంటూ ఈ సందర్భంగా నైనిక వేడుకున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus