ఆ కుర్రాడు చేసిన ఒక్క ఫోన్ కాల్, అధికారులను పరుగెత్తించింది

ఇటీవల జరిగిన ఓ సంఘటన అధికారులను పరుగులు పెట్టించింది. రెండు రోజుల క్రితం రజిని కాంత్ ఇంటిలో బాంబు పెట్టినట్లు అత్యవసర సిబ్బందికి ఫోన్ వెళ్ళింది. దీనితో షాక్ కి గురైన అధికారులు బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగారు. ప్రత్యేక సిబ్బంది రజిని ఇంటి ఆవరణాన్ని మొత్తం తనిఖీ చేయడం జరిగింది. గంటకు పైగా జరిగిన సెర్చ్ ఆపరేషన్ లో ఎక్కడా బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఇది ఆకతాయిల పని అని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కాల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో విచారణ చేపట్టగా, కడలూర్ జిల్లా దగ్గర్లోని నెల్లికుప్పంకు చెందిన ఎనిమిదో తరగతి స్టూడెంట్ ఈ పని చేసినట్లు గుర్తించారు. ఐతే ఈ బాలుడు మానసిక స్థితి సరిగా లేదని పోలీసులకు విచారణలో తెలిసింది. మెడికల్ స్టేట్మెంట్స్ పరిశీలించిన అనంతరం అతడిని వదిలిపెట్టారు. ఓ 13ఏళ్ల ఆకతాయి పని అందరికీ చెమటలు పట్టించింది. రజిని కాంత్ లాంటి సూపర్ స్టార్ కి ఓ 13 ఏళ్ల కుర్రాడు చెమటలు పట్టించడం, హాట్ టాపిక్ గా మారింది. రజనీ ఈ మధ్య రాజకీయ అరంగేట్రం ప్రకటించడంతో పాటు..

సామజిక మరియు రాజకీయ అంశాలపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు కాల్ ని పోలీసులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి దర్బార్ మూవీ విడుదల చేసిన రజిని ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు శివతో అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు. రజిని ఇమేజ్ కి తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటరైనర్ ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus