Rajinikanth: నా జీవితంలో వారిద్దరికీ ఎప్పుడు రుణపడి ఉంటా… రజనీకాంత్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన భార్య లత అంటే ఎంతగా ప్రేమిస్తారో ఆమెను ఎంతగా గౌరవిస్తారో మనకు తెలిసిందే. తన భార్య లత గురించి రజనీకాంత్ ఇంతవరకు ఎన్నోసార్లు ఎన్నో విషయాల గురించి తెలియజేశారు. అయితే తాజాగా మరోసారి తన భార్య లత గురించి రజనీకాంత్ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాజాగా రజనీకాంత్ తన భార్య లత తన స్నేహితుడు మహేంద్రన్ గురించి కూడా తెలియజేశారు. తాను జీవితంలో వీరిద్దరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

లతా నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమెను చూసే నేను క్రమశిక్షణ నేర్చుకున్నాను అని తెలిపారు. తాను బస్ కండక్టర్ గా ఉన్న రోజులలో మద్యం, సిగరెట్లు ఎక్కువగా తాగే వాడిని దాంతోపాటు మాంసం కూడా ఎక్కువగా తినేవాడిని. ఈ మూడు అలవాట్లు అంత మంచిది కాదు.కానీ నా భార్య లత మాత్రం తన ప్రేమతో నన్ను ఈ వ్యసనాల నుంచి దూరం పెట్టిందని రజనీకాంత్ తెలిపారు.

కేవలం తన భార్య లత వల్లనే తాను ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నానని రజనీకాంత్ తెలిపారు. ఈ విధంగా రజనీకాంత్ తన భార్య లత తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందోననే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus