Rajinikanth: కాంతార2 విషయంలో అభిమానులకు షాక్ తప్పదా?

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. బడ్జెట్ తో పోల్చి చూస్తే 20 రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా సౌత్ సినిమా స్థాయిని పెంచిందని చాలామంది భావిస్తారు. చిన్న మూవీగా విడుదలైన ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే.

భాషతో సంబంధం లేకుండా కాంతార మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాంతార మూవీకి ప్రీక్వెల్ గా కాంతార2 సినిమా తెరకెక్కనుంది. కాంతార2 సినిమాకు సంబంధించి రికార్డ్ స్థాయిలో ఆఫర్లు వస్తుండగా కాంతార2 సినిమాలో రజనీకాంత్ మెయిన్ హీరోగా కనిపించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు. రిషబ్ శెట్టి అభిమానులు ఫీలవుతున్నారు. కాంతార2 సినిమా కూడా రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కనుందని భావించిన ఫ్యాన్స్

అందుకు భిన్నంగా జరగడంతో అభిమానులు ఫీలవుతున్నారు. తాజాగా ఒక సందర్భంలో కాంతార2 గురించి అడగగా రిషబ్ మౌనం వహించారని సమాచారం అందుతోంది. రజనీకాంత్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో సంతోషంగా ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది. కాంతార2 మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ ఏడాది జూన్ నెలలో కాంతార2 సినిమా దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది. కాంతార2 సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. కాంతార2 వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus