Rajinikanth: అవార్డులను ఆశించి సినిమా చేయను!: రజనీకాంత్

రజినీకాంత్ తన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ చాలా విరామం తర్వాత తిరిగి దర్శకురాలిగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈమె ఇటీవల లాల్ సలాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. విక్రాంత్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ పాత్రలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రజనీకాంత్ మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా లైకా సమస్థ వారు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం గురించి రజనీకాంత్ మాట్లాడారు ఈ సినిమా కథను మొదట ఐశ్వర్య నాకు వినమని చెప్పారు. ఈ కథ చెప్పడానికి ముందు ఈ సినిమాకు తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందని తెలిపారు.

ఇలా అవార్డు వస్తుందని ఇలా ఉంటే నేను విననని తెలిపాను ఎందుకంటే సినిమా ఎప్పుడు కూడా అవార్డులను ఆశించి చేయకూడదని రజనీకాంత్ తెలిపారు. నన్ను నిర్మించమని చెప్పారు అయితే నేను కొంతమంది నిర్మాతల పేర్లు సూచించాను ఈ సినిమా నేను నిర్మించనని చెబితే చాలామంది రజనీకాంత్ ఈ సినిమాని నిర్మించలేదు అని ఆలోచనలో పడ్డారు అయితే బాబా సినిమా విడుదలైన తర్వాత సినిమా రిజల్ట్ చూసి ఇకపై నేను సినిమాలను నిర్మించకూడదని నిర్ణయించుకున్నాను అందుకే ఈ సినిమాని కూడా తాను నిర్మించలేదు అంటూ (Rajinikanth) రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus