Rajinikanth: మలయాళ బ్లాక్‌బస్టర్‌ దర్శకుడితో.. రజనీకాంత్‌ నెక్స్ట్‌? ఏ సినిమా అంటే?

‘2018’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌. మలయాళ సినిమా పరిశ్రమలో గతేడాది వచ్చి గొప్ప సినిమాల్లో ఇదొకటి అని కూడా చెప్పొచ్చు. ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్‌కు వెళ్లాల్సిన సినిమా కోసం పోటీలో కూడా నిలబడిన చిత్రమిది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఆ సినిమా తెరకెక్కించిన దర్శకుడి కొత్త సినిమా రజనీకాంత్‌తో (Rajinikanth) అంటున్నారు కాబట్టి. ‘జైలర్‌’  (Jailer) సినిమా తర్వాత రజనీకాంత్‌ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది అంటున్నారు.

Rajinikanth

సగటు కమర్షియల్‌ సినిమాకు దూరంగా సినిమా కథలు ఎంచుకుంటున్నారాయన. ఇప్పుడు చేస్తున్న ‘కూలీ’, ‘వేట్టయాన్‌’ అలాంటివే అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్‌ (Rajinikanth) ‘జైలర్‌ 2’ చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే లేటెస్ట్‌ టాక్‌ ప్రకారం అయితే జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ సినిమా ఉండొచ్చు అంటున్నారు. రజననీకాంత్‌ – జ్ఞానవేల్‌ (T. J. Gnanavel) కాంబినేషన్‌లో రూపొందిన ‘వేట్టయాన్‌’ (Vettaiyan) .. ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ లోపు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ‘కూలీ’ (Coolie) సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌ 2’ ఉంటుంది. ఆ వెంటనే జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ సినిమా ఉంటుందట. ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. వేల్స్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. నిజానికి శింబుతో (Simbu) ఈ సినిమా చేయలని జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ అనుకున్నారు.

ఈ మేరకు ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ వివిధ కారణాల వల్ల సినిమా మెటీరియలైజ్‌ అవ్వలేదు. కథా స్థాయిని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఈ క్రమంలో తలైవా అయితే బెటర్‌ అని అనుకుంటున్నారట. మరి ఆయన ఓకే చేస్తారా అంటే.. పైన చెప్పాం కదా.. ఇటీవల వరుసగా ఇలాంటి ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. కాబట్టి రజనీని  మలయాళ దర్శకుడు ఎలా చూపించబోతున్నారో అని మనం వెయిట్‌ చేయొచ్చు.

బాబీ సినిమాకు సంబంధించి బాలయ్యకు ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus