సూపర్ స్టార్ సినిమాకి టొరెంట్ సైట్స్ భారీ షాక్!

  • January 10, 2020 / 04:41 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. తొలిరోజే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రజినీకాంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా చూసిన ఆయన ఫ్యాన్స్ తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా రిలీజైన కొద్ది గంటల్లోనే పైరసీ సైట్లలోకి వచ్చేసింది. ‘తమిళ రాకర్స్’ వారు ఈ సినిమాని పైరసీ చేసి నెట్ లో పెట్టేశారు. విడుదలైన సినిమాలను గంటల్లోనే పైరసీ చేసి దానిని ఆన్‌లైన్‌లో లీక్ చేయడం ‘తమిళ రాకర్స్’కు కొత్తకాదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ ఇలా ఏ భాషకి చెందిన సినిమా అయినా.. వెంటనే పైరసీ చేస్తుంటారు. ‘దర్బార్’ సినిమా కూడా పైరసీ సైట్లలో దర్శనమివ్వడంతో సూపర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. నయనతార, నివేదా థామస్, సునీల్ శెట్టిలు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కించారు.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus