Jailer Movie: జైలర్ మూవీతో రజనీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. కానీ?

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ మూవీ ఆగష్టు నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం గమనార్హం. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో రజనీకాంత్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో వింటేజ్ రజనీకాంత్ ను చూడవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా సినిమాకు రజనీకాంత్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. సెన్సార్ సభ్యులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించారు. సినిమాలో థ్రిల్లింగ్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. 2 గంటల 49 నిమిషాల నిడివితో ఈ సినిమా (Jailer Movie) థియేటర్లలో విడుదలవుతోంది.

అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఒక్కరోజులో జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది. రజనీ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలవనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జైలర్ సినిమా విడుదలైన మరుసటి రోజున భోళా శంకర్ మూవీ రిలీజ్ కానుండగా భోళా శంకర్ మూవీ ప్రభావం జైలర్ పై పడే అవకాశం ఉంది.

భోళా శంకర్ మూవీ టాక్ ఎలా ఉన్నా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. భోళా శంకర్ సినిమా ట్రైలర్ కు ఇప్పటివరకు 9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. జైలర్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus