Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » రాజుగాడు

రాజుగాడు

  • June 1, 2018 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజుగాడు

“భలే భలే మగాడివోయ్, మహానుభావుడు” చిత్రాల తరహాలో హీరోకి ఏదైనా విచిత్రమైన రోగం ఉంటే.. అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం “రాజుగాడు”. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రాంగోపాల్ వర్మ శిష్యురాలు సంజానారెడ్డి దర్శకురాలిగా పరిచయమయ్యింది. గత కొంత కాలంగా విడుదలకు ఇబ్బందిపడుతూ ఎట్టకేలకు ఇవాళ (జూన్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు “రాజుగాడు”. మరి ఆ రాజుగాడి అల్లరి ఆడియన్స్ కు నచ్చిందో లేదో చూద్దాం.rajugadu-1

కథ : ప్రాణంగా చూసుకొనే తల్లి (సితార), కంటికి రెప్పలా కాపాడుకొనే తండ్రి (రాజేంద్రప్రసాద్), ఎగువ మధ్యతరగతి లైఫ్ స్టైల్.. ఇలా అన్నీ ఉన్నప్పటికీ ఓ మాయదారి రోగం కారణంగా ఎప్పటికప్పుడు అల్లరిపాలవుతూ తల్లిదండ్రుల్ని టెన్షన్ పెడుతుంటాడు రాజు అలియాస్ రాజుగాడు (రాజ్ తరుణ్). రాజుగాడి అందర్నీ టెన్షన్ పెట్టడానికి, మనోడు టెన్షన్ పడడానికి గల కారణం క్లెప్టోమేనియా. ఈ ఫోబియా వల్ల రాజుగాడు తనకు తెలియకుండానే ఇతరుల పర్సులు, ఫోన్ లు కొట్టేస్తుంటాడు. ఇంటికి వచ్చాక కానీ తెలియదు ఏం కొట్టుకొచ్చాడో. మొదట్లో ఇష్యూ పెద్ద సీరియస్ కాదు కాబట్టి ఎవరూ పట్టించుకోరు. కానీ.. రానురాను ఆ ఫోబియా కారణంగా సమస్యల్లో ఇరుక్కొంటుంటాడు రాజుగాడు.

ముఖ్యంగా తాను ప్రేమించిన అమ్మాయి (అమైరా దస్తూర్)కు తన వీక్ నెస్ తెలియకుండా దాయడం కోసం నానా ఇబ్బందులు పడుతుంటాడు. అయితే.. అమైరా తండ్రి (నాగినీడు) అబద్ధం ఆడినా, తప్పు చేసినా సహించలేడు. ఆ నాగినీడ్ని ఒప్పించడానికి తల్లిదండ్రులతో కలిసి రాజుగాడు చేసిన అల్లరే “రాజుగాడు” చిత్ర కథాంశం.rajugadu-2

నటీనటుల పనితీరు : వరుసబెట్టి ఆ తరహా పాత్రలు ఎక్కువగా చేస్తుండడం వల్లనో లేక స్టైలింగ్ ఛేంజ్ చేయకపోవడం వల్లనో తెలియదు కానీ.. రాజ్ తరుణ్ నటన కానీ, లుక్స్ కానీ ఏమాత్రం కొత్తగా కనిపించదు, అనిపించదు. అయితే.. మనోడి కామెడీ టైమింగ్ ఆ మైనస్ పాయింట్స్ ను కవర్ చేసేస్తుంది. రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయనకు పోటీగా రాజ్ తరుణ్ పండించిన కామెడీ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.

చాలారోజుల తర్వాత రాజేంద్రప్రసాద్ ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేసిన సినిమా “రాజుగాడు”. భలే నవ్విస్తాడాయన ఈ చిత్రంలో. అసభ్యతకు తావు లేకుండా “అహనా పెళ్లంట” రేంజ్ లో నవ్వించాడు రాజేంద్రుడు. అమైరా అందం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది. చాలారోజులుగా తెలుగులో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అమైరాకు “రాజుగాడు” బాగా కలిసొచ్చాడు. రెగ్యులర్ హీరోయిన్ రోలే అయినప్పటికీ.. తన ప్రెజన్స్ తో ఆకట్టుకొంది.

రాజారవీంద్ర, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు కారుమంచు, ప్రవీణ్ లు కడుపుబ్బ నవ్విస్తే.. నాగినీడు, రావురమేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.rajugadu-3

సాంకేతికవర్గం పనితీరు : తొలి చిత్రంతోనే దర్శకురాలిగా తనదైన మార్క్ వేసిన సంజానారెడ్డి గురించి ముందుగా ప్రస్తావించాలి. మొదటి చిత్రంతోనే డజను మంది ఆర్టిస్ట్స్ ను హ్యాండిల్ చేస్తూ వాళ్లందరి చేత సునాయాసంగా కామెడీ పండించిన ఆమె ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. అయితే.. మొదటి సినిమా కాబట్టి స్క్రీన్ ప్లే విషయంలో కాస్త తడబడింది. కొన్ని సీన్స్ మరీ ఫార్మాట్ మోడల్ లో ఉన్నాయి. కామెడీ ఎపిసోడ్స్ పక్కన పెడితే కథనం పరంగా సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను పక్కన పెడితే.. డైరెక్టర్ గా పర్వాలేదనిపించుకొంది.

గోపీసుందర్ బాణీలు కొత్తగా లేకపోయినా బి.రాజశేఖర్ ఆ పాటను పిక్చరైజ్ చేసిన విధానం డిఫరెంట్ గా, కలర్ ఫుల్ గా ఉండడంతో పాటలు బాగానే ఎక్కేస్తాయి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి వేల్యూ యాడ్ చేసింది. కొత్తగా ఏమీ ఉండదు కానీ.. రిచ్ గా ఉంటుంది.

సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అనిల్ సుంకర చెప్పినట్లుగా.. “రాజుగాడు” అదరగొట్టే సినిమా కాదు, ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే సినిమా. అయితే.. ఆ కామెడీ అందరికీ రుచించకపోవచ్చు. బి, సి సెంటర్ ఆడియన్స్ మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.

కథ, కథనం “మహానుభావుడు” చిత్రాన్ని మహాబాగా గుర్తుకుతెచ్చినప్పటికీ.. రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ ఆ విషయాన్ని మరిపిస్తుంది. ఆయన లేకపోతే ఈ సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో.rajugadu-4

విశ్లేషణ : కొత్తదనం అనేది ఆశించకుండా కాసేపు హ్యాపీగా నవ్వుకోవడం కోసం సరదాగా ఒకసారి చూడదగ్గ చిత్రం “రాజుగాడు”. అద్భుతంగా ఉండకపోయినా.. రెండు గంటలపాటు అలరించే విధంగా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా హల్ చల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.rajugadu-5

రేటింగ్ : 2/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amyra Dastur
  • #Raj Tarun
  • #Raju Gadu Movie Review
  • #Raju Gadu Telugu Review

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

6 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

26 mins ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

39 mins ago
Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

1 hour ago
Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

2 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version