‘రాజుగాడు’ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల

రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన ఆదరణ చూరగొనడంతోపాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ.. “రాజ్ తరుణ్ మా బ్యానర్ లో చేస్తున్న నాలుగో చిత్రమిది. సంజనా రెడ్డి చాలా చక్కగా తెరకెక్కించింది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్ గారి కామెడీ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. విడుదలైన టీజర్ మరియు పోస్టర్స్ కి మంచి స్పందన లభించింది. మే 11న చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నాం. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం. మా బ్యానర్ లో “రాజుగాడు” మరో హిట్ సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus