Rakhi Sawant: బోల్డ్‌ నటికి బోలెడు చుక్కలు చూపించిన శునకాలు!

బాలీవుడ్‌లో బోల్డ్‌ అంటే ఇప్పుడు చాలా మంది నాయికలు కనిపిస్తారు కానీ… కొన్నేళ్ల క్రితం ఇద్దరో, ముగ్గురో ఉండేవారు. అలాంటి వారిలో రాఖీ సావంత్‌ ఒకరు. విషయమేదైనా కరాఖండిగా మాట్లాడేస్తుంటుంది. అందుకే అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి కావాలనే వివాదం చేస్తూ ఉంటుంది. తాజాగా ‘బిగ్‌బాస్‌ ఓటీటీ’లో తనను తీసుకోలేదంటూ ఆందోళన చేసింది. దానికి బిగ్‌బాస్‌ టీమ్‌ దిగొచ్చింది అనుకోండి. అయితే ఈ క్రమంలో శునకాలు ఆమె వెంటపడటం గమనార్హం.

సినిమాల్లో ఎంత పేరు తెచ్చుకుందో… బిగ్‌బాస్‌లో పాల్గొని అంతే క్రేజ్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ సీజన్‌14 తర్వాత ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. అయితే మరోసారి బిగ్‌బాస్‌ సీజన్‌ 15 ఓటీటీలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపింది. స్పైడర్‌ ఉమెన్‌ గెటప్‌ వేసి ముంబయి నగర వీధుల్లో హల్‌చల్‌ చేసింది. దీంతో బిగ్‌బాస్‌ టీమ్‌ ఆమెను ఈ ఓటీటీ సీజన్‌లో పాల్గొనే ఛాన్స్‌ ఇచ్చారు. దీంతో షోలో ఎంటర్‌ అవ్వడానికి విచిత్రమైన డ్రెస్‌లో రెడీ అయ్యి వచ్చింది. అక్కడే అసలు మజా మొదలైంది.

ఆమె వేసుకున్న భారీ డ్రెస్‌ చూసి అక్కడివాళ్లు ఆశ్చర్యపోయారు. అలా షాక్‌ అయినవారిలో అక్కడి శునకాలు కూడా ఉన్నాయి. మనుషులు నోళ్లు వెళ్లబెడితే… శునకాలు ఆమెను పరుగులు పెట్టించాయి. రాఖీ కారు దిగి సెట్‌లోకి అడుగుపెడుతుండగా కుక్కులు ఆమెను వెంబడించాయి. దీనికి సంబంధించిన వీడియోను రాఖీ సావంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అదన్నమాట సంగతి.


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus