Rakul Preet Singh: ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’ సెట్‌లో రకుల్‌ ఏం చేసిందో తెలుసా?

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ అని అంటుంటారు. ఇంకొందరేమో ఫియర్‌లెస్‌ బ్యూటీ అని అంటుంటారు. ఆమెను క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేసేవాళ్లయితే ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అని చెప్పేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె ఇవన్నీను. ఇంకా చెప్పాలంటే మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడవన్నీ ఎందుకు అంటున్నారు. ఇటీవల రకుల్‌ ఓ సినిమా సెట్‌లో చేసిన సాహసం గురించే ఇదంతా. ఆమె చేసిన పని గురించి టోటల్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది మరి.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ల బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. దీంతోపాటు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ అనే సినిమా షూట్‌లో పాల్గొంది. అందులో భాగంగా ఓ ట్రక్‌ నడిపే సన్నివేశంలో నటించిందట. బైక్‌, కారు అంటే ఓకే కానీ ఓ హీరోయిన్‌ ట్రక్‌ నడిపింది అంటే పెద్ద విషయమే కదా. అందుకే అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారట. మరి ట్రక్‌ నడపడం ఎలా ఉంది అని అడిగితే… ‘ఈ అనుభవం నాకు సరికొత్తగా’ ఉందని చెప్పింది.

రకుల్‌కు తొలుత నుండి డ్రైవింగ్‌ అంటే బాగా ఇష్టమట. ట్రక్‌ నడపాలని గతంలో అనుకున్నా పెద్దగా కుదర్లేదట. దీంతో ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’లో ఆ అవకాశం వచ్చేసరికి వెంటనే ఒప్పేసుకుందట. అందుకుతగ్గట్టే ట్రక్‌ నడిపి వావ్‌ అనిపించుకుందట. ఆమె ట్రక్‌ నడిపే సయంలో సెట్‌లో ట్రైనర్‌ కూడా ఉన్నాడట. ఆయన చెప్పిన టిప్స్‌తో ట్రక్‌ నడుపుతూ, సీన్‌ను పూర్తి చేసిందట. ఆమె తెగువకు సెట్‌లో అందరూ మెచ్చుకున్నారట. అర్జున్ కపూర్ హీరోగా నటిస్తోన్న ‘సర్దార్ కా గ్రాండ్ సన్ ’వచ్చే నెల 18న నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతోంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus