లాక్ డౌన్ లో స్టూడెంట్ గా మారిన రకుల్ ప్రీత్

హీరోయిన్ రకుల్ లాక్ డౌన్ టైం లో స్టూడెంట్ గా మారిపోయింది. ఆమె శ్రద్ధగా కంప్యూటర్ ముందు కూర్చొని పాఠాలు వింటుంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్న తారలు తమకు ఇష్టం వచ్చిన వ్యాపకాలు, పెండింగ్ వర్క్స్ వంటివి చూసుకుంటున్నారు.హీరోయిన్ రకుల్ మాత్రం ఆన్లైన్ లో ఎమ్ బి ఏ క్లాసులకు హాజరవుతుంది అట. సిస్టం ముందు కూర్చొని టీచర్స్ చెప్పే విషయాలు వింటూ, నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తుందని సమాచారం.

స్టార్ హీరోయిన్ అయినా చదవు ముఖ్యం అని భావిస్తున్న రకుల్ కమిట్మెంట్ ని మెచ్చుకోవలసిందే. ఇక ఎం బి ఏ క్లాసులతో పాటు, ట్రేడ్ అనాలిసిస్, మెరైన్ ఇంజనీరింగ్ వంటి విషయాలపై కూడా రకుల్ అవహగాన పెంచుకుంటున్నారట. మ్యాథమెటిక్స్ లో డిగ్రీ అందుకున్న రకుల్ జీవితానికి ఉపయోగపడే మేనేజ్మెంట్ మరియు ఇంజనీరింగ్ వంటి విషయాలపై కూడా నాలెడ్జ్ పెంచుకుంటుంది. అలాగే తన యూ ట్యూబ్ ఛానల్ పై కూడా ఆమె శ్రద్ద పెట్టారట.

ఇక లాక్ డౌన్ సమయంలో అనేక మంది పేదలకు ఆహారం అందించి రకుల్ పెద్ద మనసు చాటుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ, తమిళ పరిశ్రమలో కూడా సినిమాలు చేస్తుంది. తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు లేవు. నితిన్ హీరోగా చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Most Recommended Video

ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus