గ్లామర్ పాత్రలతో కెరీర్ ప్రారంభించి.. ఓ ఫేమ్, పేరు, క్రేజ్ వచ్చాక నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తుంటారు మన కథానాయికలు. చాలామందికి ఇది వర్కవుట్ అయ్యింది కూడా. ఇంకొంతమంది అయితే.. టాలీవుడ్‌లో సినిమాలు తగ్గుతున్నాయి అని తెలియడం ఆలస్యం పక్క పరిశ్రమలకు వెళ్లిపోతుంటారు. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వరుస సినిమాలు చేసి బిజీ అనిపించుకున్న రకుల్.. ఇప్పుడు బాలీవుడ్‌లో ఉంది. అయితే అక్కడ సరైన సినిమాలు అయితే లేవు.
రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే.. రెండూ బోల్డ్ టాపిక్‌లే. ఒకటి ‘డాక్టర్ జి’ కాగా రెండో ‘ఛత్రివాలి’. గైనకాలజిస్ట్‌గా ఓ పురుష వైద్యుడు చేసే పోరాట కథతో రూపొందిన సినిమా ‘డాక్టర్ జి’ అయితే కండోమ్ టెస్టర్ పని చేసే ఓ యువతి కథతో రూపొందుతున్న చిత్రం ‘ఛత్రివాలి’. ఇందులో ప్రధానమైన టెస్టర్ పాత్రను రకుల్ చేసింది. దీంతో రకుల్ సినిమాల ఎంపికల మీద సోషల్ మీడియాలో జోకులు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రకుల్ ఇటీవల మీడియాకు ఎదురుపడితే అదే విషయం అడిగేశారు. ఇలాంటి కథాంశాల్లో నటిస్తున్నానని మీ ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో ఏమైనా అభ్యంతరం తెలిపారా? అంటూ రకుల్‌ను అడిగారు. దానికి రకుల్ తనదైన శైలిలో రెబల్ ఆన్సర్ ఇచ్చింది. నేను చేస్తున్న ఈ రెండు సినిమాలు సామాజిక సమస్యలపై చర్చను లేవనెత్తేలా ఉంటాయి. అందుకే ఆ సినిమాల గురించి నా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాటిని గొప్ప ఆలోచనలుగా వాళ్లు భావిస్తారు.
అందుకే ఆ సినిమాల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పింది రకుల్. ‘డాక్టర్ జి’, ‘ఛత్రివాలి’ సినిమాలో చర్చిస్తున్న అంశాల గురించి నిషేధం ఉండటం దురదృష్టకరమన్న రకుల్… పునరుత్పత్తి అవయవాన్నే ఎందుకు భిన్నంగా చూడాలి అంటోంది. గుండె, మెదడు.. ఇలా శరీరంలోని ఇతర వ్యవస్థల కంటే దానిని కూడా చూస్తే సరిపోతుంది. చికిత్స చేసే వైద్యుడు మగవాడైతే ఏంటి? ఆడవారైతే ఏంటి? ఈ అంశంపైనే ‘డాక్టర్ జి’ సినిమాలో చర్చిస్తున్నాం అని చెప్పుకొచ్చింది రకుల్. ‘ఛత్రివాలి’ కండోమ్‌ల గురించి చర్చ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!