హీరోయిన్ల పై ట్రోలింగ్… టాపిక్ కొత్తదేమీ కాదు. సోషల్ మీడియాలో ఊపందుకున్నాక.. ఇలా చేస్తుండడం మామూలే..! సాధారణంగా వాళ్ళ పోస్ట్ చేసిన ఫోటోలు బాలేదు అంటూ ట్రోల్ చేసే వాళ్ళుంటారు. వాళ్లకి పెద్దగా హీరోయిన్లు రియాక్ట్ అవ్వరు. అది వారి ఇష్టం అని వదిలేస్తుంటారు. కానీ అసభ్యకరమైన పదజాలాలతో కామెంట్స్ చేయడం వంటివి వారిని కూడా ఇబ్బంది పెడుతుంటాయి. వారి కూడా మనుషులే.. వారిది కూడా సున్నిత మైన మనస్తత్వమే అని మనం కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి గుర్తించనప్పుడు.. ఇదిగో రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్లతో చివాట్లు తినాల్సి ఉంటుంది.
విషయం ఏమిటంటే.. తన ఇన్స్టా ఖాతాల్లో రకుల్ ఎప్పుడూ.. తన కొత్త ఫోటో షూట్ కు సంబందించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. తన అభిమానులు వాటికి లైక్స్ కొడుతుంటారు. మరికొందరు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతుంటారు. కానీ అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ట్రోల్ చేసే మరికొంత మంది ఉంటారు. అలా తాజాగా ఓ నెటిజెన్ కామెంట్ చేసిన కామెంట్ కు రకుల్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది. రకుల్ పోస్ట్ చేసిన ఓ ఫోటోకి నెటిజెన్ స్పందిస్తూ.. ‘చొక్కా మాత్రమే వేసుకున్నారా… కింద ఏమైనా ఉందా? కారులో చిల్ అయ్యి అలానే బయటకు వచ్చారా? అంటూ అసభ్యంగా కామెంట్ చేశాడు. దీనికి రకుల్ ఆగ్రహంతో.. ‘మీ అమ్మ ఎప్పుడైనా అలా చేసిందా..,అందుకే ఇలాంటి కామెంట్ చేశావు’ అంటూ ఫైర్ అయ్యింది. ‘ఇలాంటి కామెంట్లు చేసే వాళ్ళు ఫేక్ అకౌంట్ లతోనే చేస్తారు. అంత ధైర్యం మీకెక్కడిది.. మీరు పిరికివాళ్ళే…! మీలాంటి వాళ్ళను కనిపెట్టేలా టెక్నాలిజీ అభివృద్ధి చెందినప్పుడే.. ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ ఆగుతాయి” అంటూ చెప్పుకొచ్చింది.