ఎన్నడూ లేనిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా హీరోయిన్ కష్టం వచ్చింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పింక్’ రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’ లోనూ అలాగే క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రంలోనూ.. ఇంకా హీరోయిన్లు ఫిక్స్ కాలేదు. ‘వకీల్ సాబ్’ చిత్రంలో శృతీ హాసన్ ఫిక్స్ అయినట్టు కొన్నాళ్ళు ప్రచారం జరిగింది.. డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా ఈ విషయాన్ని ఓ సందర్భంలో రివీల్ చేశాడు. కానీ చివరికి శృతీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇక క్రిష్ డైరెక్షన్లో పవన్ చేస్తున్న చిత్రంలో .. ‘సాహో’ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అలాగే ప్రగ్య జైస్వాల్ వంటి హీరోయిన్లు నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. కానీ చిత్ర యూనిట్ వర్గాల నుండీ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. తాజాగా పవన్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే అది ‘వకీల్ సాబ్’ సినిమాలోనా లేక ‘పవన్ 27’ లోనా అన్నది మాత్రం క్లారిటీ లేదు.
ఈ రెండిటిలో ఏ చిత్రంలో ఛాన్స్ వచ్చినా.. రకుల్ కు ప్లస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పుడు ఆమె చేతిలో ఆఫర్లు పెద్దగా లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వస్తే మాత్రం ఆమెకు చాలా ప్లస్ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే పవన్ నిర్మాతలు హీరోయిన్ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అనేది చూడాల్సి ఉంది.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?