ఫ్యాన్స్ కి సలహా ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్
- December 30, 2016 / 11:12 AM ISTByFilmy Focus
అభిమానించే వాళ్లు ఉండడం ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తుంది. సినీ నటీనటులకైతే అభిమానులు చాలా ఎక్కువమంది ఉంటారు. ఫ్యాన్స్ స్టార్స్ కి బూస్ట్ లా వ్యహరిస్తుంటారు. ఈ అభిమానుల వల్ల ఆనందమే కాదు కొన్ని సార్లు ఇబ్బంది కూడా పడుతుంటారు. తాజాగా రన్ రాజా రన్ బ్యూటీ సీరత్ కపూర్‌కు ఓ వీరాభిమాని రక్తంతో ప్రేమలేఖ రాశాడు. తన చేతిపై ఎస్ అని కత్తి తో ఘాటు పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసి సీరత్ కంగారు పడింది. ఇలాంటి పనులు తనకి ఇష్టముండదని, ఎవరూ ఇలా చేయొద్దని సూచించింది. ఈ సంఘటన టాలీవుడ్ ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ని కలిచి వేసింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సందేశం ఇచ్చింది.
“ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనది. తమను తాము ముందుగా ప్రేమించుకోవాలి. ఇలా గాయపరుచు కోవద్దు. అభిమానం ప్రదర్శించడానికి ఎన్నోమార్గాలున్నాయి. రక్తంతో ప్రేమ లేఖ రాయడం దారుణం. ఎవరూ అలా చేయొద్దు” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రకుల్ చెప్పిన మంచిమాటను కొంతమంది అయినా పాటిస్తారనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












