‘కెరటం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రకుల్.. ఆ తరువాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. అటు తరువాత ‘కరెంట్ తీగ’ ‘లౌక్యం’ వంటి చిత్రాలతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రమంలో రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోల సినిమాల్లో ఛాన్స్ లు లభించాయి. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపొయింది రకుల్. సక్సెస్ రేటు పెద్దగా లేకపోయినా.. ఈమెకు వరుస ఆవకాశాలు వస్తుండడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసింది.
సక్సెస్ లు కూడా లేకుండానే పారితోషికం పెంచెయ్యడంతో దర్శకనిర్మాతలు ఈమెను ఎవాయిడ్ చెయ్యడం మొదలు పెట్టారు. కొన్నాళ్ళకి ఈమె కేవలం ‘గ్లామర్ పాత్రలు చెయ్యడం వల్లనే అవకాశాలు తగ్గాయి’ అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఈమకు మాత్రం కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలు లభించలేదు. ఈ నేపథ్యంలో రకుల్ ఓ నిర్ణయం తీసుకుందట. పారితోషికం తగ్గించుకోవాలి అని డిసైడ్ అయ్యిందట.
ప్రస్తుతం నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘చెక్’ చిత్రానికి గాను ఈమె తక్కువ పారితోషికమే అందుకున్నట్టు తెలుస్తుంది. అయినా రకుల్ ను ఇంకా దర్శకనిర్మాతలు పట్టించుకోవట్లేదని వినికిడి. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు’ అని బహుశా పెద్దవాళ్ళు ఇందుకే అంటారేమో!