మహేష్ బాబు తో రకుల్ రొమాన్స్ షురూ!
- August 23, 2016 / 10:10 AM ISTByFilmy Focus
తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా రెండో షెడ్యూల్ నేడు (మంగళవారం) మొదలయింది. ఈ చిత్రీకరణలో ప్రిన్స్ తో పాటు ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొంది. వీరిద్దరి పైన రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ విషయాన్నీ రకుల్ వెల్లడించింది. “ప్రతిభావంతులైన మహేష్, మురుగదాస్ సార్ లతో మొదటి రోజు కలిసి పని చేసాను. చాలా సంతోషంగా ఉంది.” అని పంజాబీ భామ ట్వీట్ చేసింది.
ఎం.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ నగరంలో కొన్ని రోజుల క్రితం విజయవంతంగా పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే. రెండో షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతోంది. ప్రస్తుతం హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తున్నఈ సినిమా టైటిల్ ని దసరాకు రివీల్ చేసే ఆలోచనలో ఉన్నటు చిత్ర బృందం ప్రకటించింది. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్న ఈ ఫిల్మ్ ని తెలుగు, తమిళం రెండు భాషల్లో వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Day 1 of shoot for #Mahesh23 with @ARMurugadoss sir. Super excited to b workin wd both extremely talented people. 😃😃😃
— Rakul Preet (@Rakulpreet) August 23, 2016

















