రాంచరణ్ రికమండేషన్ తో జక్కన్న ఆమెనే ఫైనల్ చేసాడట..!

‘బాహుబలి'(సిరీస్) తర్వాత రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. దానికి పూర్తి పేరు ‘రౌద్రం రణం రుథిరం’ అని ఇటీవల రివీల్ చేసిన సంగతి తెలిసిందే. రాంచరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం కాబట్టి దీని పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ చిత్రం గురించి అన్ని భాషల్లో ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాంచరణ్ పుట్టినరోజున విడుదల చేసిన ‘భీం ఫర్ రామరాజు’ వీడియోనే ఇందుకు బెస్ట్ ఎగ్జామ్పుల్ అని చెప్పాలి. అయితే లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ పుట్టినరోజున ఎటువంటి వీడియోని విడుదల చెయ్యలేకపోయామని నిర్మాతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం గురించి ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ఉందట. దానికోసం రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారట. రాంచరణ్ రిఫరెన్స్ తోనే ఆమెను తీసుకున్నారని ప్రచారం నడుస్తుంది.

గతంలో చరణ్, రకుల్ కలిసి ‘బ్రూస్ లీ’ ‘ధృవ’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి ఐటెం సాంగ్ ఉంటుంది అని వార్తలు రావడం సహజం. అయితే ఈ చిత్రం ఇద్దరు స్వాతంత్ర సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితాలకు సంబంధించిన చిత్రం కాబట్టి అసభ్యంగా ఐటెం సాంగ్ లు ఎందుకు ఉంటాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus