Rakul Preet: రకుల్‌ షేర్‌ చేసిన వీడియో వైరల్

  • April 2, 2021 / 12:16 PM IST

సినిమా హీరోయిన్ల ఫిట్‌నెస్‌ గురించి చెబుతూ, హెల్థీ ఫుడ్‌ గురించి వివరిస్తూ ఉపాసన కొణిదెల కొన్ని వీడియోలు రూపొందిస్తున్నారు. ‘యువర్‌ లైఫ్‌’ పేరుతో రూపొందిస్తున్న ఆ వీడియోలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ వీడియోల్లో ఇప్పటివరకు సమంత, రష్మిక వచ్చి తమ ఫిట్‌నెస్‌ సీక్రెట్లు అభిమానులతో పంచుకున్నారు. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ వీడియోలో కనిపించింది. ఆమె ఫిట్‌ నెస్‌ సీక్రెట్‌తో పాటు… ఉపాసన సీక్రెట్‌ కూడా చెప్పేసింది రకుల్‌.

యువర్‌ లైఫ్‌ కొత్త వీడియోలో రకుల్‌ ప్రీత్‌ వచ్చి… ‘పాలకూర బఠాణి పలావ్‌’ ఎలా తయారు చేయాలి, అది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అనే విషయాలు తెలియజేసింది. ఆమె రోజూ తినే ఆహారం ఇదే అని కూడా చెప్పింది. ఈ క్రమంలో ఉపాసన డైట్‌ గురించి లీక్‌ చేసేసింది రకుల్‌. ఉపాసన తరచూ డైట్‌లో ఉంటుందని, అస్సలు రైస్‌ తినడానికి ఆసక్తి చూపించదని రకుల్‌ చెప్పింది. అందుకే ‘పాలకూర బఠాణి పలావ్‌’ ట్రై చేయమని సలహా కూడా ఇచ్చింది.

‘పాలకూర బఠాణీ పలావ్‌’ సిద్ధం చేసుకుంటే… నువ్వు కూడా రైస్‌ తినొచ్చు అంటూ ఫుడ్‌ గురించి చెప్పింది. ఇందులో రైస్‌ చాలా తక్కువగా పాలకూర, బఠాణి ఎక్కువగా ఉంటాయట. అంతేకాదు ఈ ఫుడ్‌ తింటే వర్కౌట్లు కూడా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉండదని చెప్పింది. అయినా రకుల్‌ చెప్పింది కేవలం ఉపాసనకే కాదు కదా… మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్‌ ఉంటే ట్రై చేయొచ్చు.


Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus