పాత్రకు తగ్గ నటీనటుల్ని ఎంపిక చేయడంలోనే దర్శకుని ప్రతిభ దాగుంది. అటువంటిది ఇదివరకు అనేక పాత్రలు పోషించి మంచి నటులుగా పేరు తెచ్చుకున్న వారి పాత్రలు పోషించే వారిని సెలక్ట్ చేయాలంటే మరింత ప్రతిభ అవసరం. ఆ ట్యాలెంట్ తనకి ఉందని క్రిష్ ఇప్పటికే నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రకు రానాని, అక్కినేని పాత్రకు సుమంత్ ని ఎంపిక చేసుకున్నప్పుడే వందశాతం పెర్ఫెక్షనిస్ట్ అని రుజువైంది. వారి లుక్ బయటికి వచ్చిన తర్వాత ఈ బయోపిక్ పై మరింత ఆసక్తి కలిగింది. బాలకృష్ణ ఎన్టీఆర్ గా నటిస్తున్న ఈ బయోపిక్ రెండు భాగాలుగా వస్తోంది. మొదటి పార్ట్ లో సినిమా లైఫ్ ని చూపించబోతున్నారు. ఇందుకు ‘కథానాయకుడు’ అనే అటైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ జనవరి 9 న రిలీజ్ కానుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని రెండో భాగంలో చూపించనున్నారు. ఇందుకు మహానాయకుడు అనే అటైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా జనవరి 24 న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రాల్లో నటీనటుల గురించి రోజుకో విషయం బయటికి వస్తోంది. సావిత్రి రోల్ కి నిత్యామీనన్ ని తీసుకున్నారు. అలాగే శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ ని ఎంపిక చేశారు. ఆ విషయం తెలిసి క్రిష్ ని అందరూ అభినందిస్తున్నారు. అతని సెలక్షన్ కి తిరుగులేదని అంటున్నారు. శ్రీదేవికి సరితూగే అందం రకుల్ సొంతం. ఇక అభినయాన్ని రాబట్టుకోవడం క్రిష్ కి మెగా ఫోన్ తో పెట్టిన విద్య అంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కథానాయకుడు లో రకుల్ లుక్ చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.