ఎన్టీఆర్ కోసం ఐటెం భామగా మారిన రకుల్
- March 14, 2017 / 06:30 AM ISTByFilmy Focus
స్టార్ సినిమాల్లో ఐటెం భామలతో స్పెషల్ సాంగ్స్ చేయించడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్, టాప్ హీరోయిన్లు ప్రత్యేక పాటల్లో అదరగొట్టడం తారక్ సినిమా స్టైల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత చిత్రం జనతా గ్యారేజ్ లో టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ “పక్కా లోకల్” అంటూ స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ 27 సినిమాలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఐటెం సాంగ్ లో చిందేయడానికి సిద్ధమైంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెప్పించనున్నారు. వీరి పక్కన కథానాయికుల్లో ఒకరిగా రాశీఖన్నా సెలెక్ట్ అయింది.
ఇంకా ఇద్దరు భామలను ఎంపిక చేసేపనిలో డైరక్టర్ బాబీ బిజీగా ఉన్నారు. వారికంటే ముందు ఐటెం భామగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. కొన్నిరోజుల క్రితం మొదలయిన ఈ షూటింగ్ లో రేపటి నుంచి ఎన్టీఆర్ జాయిన్ కానున్నారు. అతని మూడు పాత్రల్లో ఒక గెటప్ ఫైనల్ కావడంతో ఆ పాత్రపై ఉన్న సీన్లు ముందుగా తెరకెక్కించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















