ఒకేసారి మూడు సినిమాలు ఓటీటీ రిలీజ్ కు రెడీ

తెలుగులో సరైన ఆఫర్లు లేవు, తమిళంలో ఆఫర్లు ఉన్నా.. హిట్లు లేవు. బాలీవుడ్ లోను ఆశించిన స్థాయి సినిమాలు లేవు. దాంతో ఇక ఆమె కెరీర్ అయిపోనట్లే అని అందరూ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. కెరీర్ పరంగా ఉన్న ఈ లోటుపాట్లు చాలవన్నట్లు.. డ్రగ్స్ కేస్ ఒకటి రకుల్ పై భారీ ఎఫెక్ట్ చూపించింది. నెట్ లో జనాలు ఆమెను విపరీతంగా ఆడుకున్నారు. తర్వాత ఆ కేస్ లో ఆమెకు సంబంధం లేదు అని క్లారిటీ వచ్చినప్పటికీ.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

ఇన్ని అవరోధాలను ఎదుర్కొని కూడా రకుల్ నిలదొక్కుకొని మళ్ళీ సినిమాలకు రెడీ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం రకుల్ తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో రెండు, హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. తమిళంలో రెండు సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉండగా.. తెలుగులో నితిన్ తో నటిస్తున్న “చెక్”, వైష్ణవ్ తేజ్ కు జంటగా నటిస్తున్న “కొండ పొలం” చిత్రాలు షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉన్నయి.

అలాగే హిందీలో సిద్ధార్ధ్ మల్హోత్రా సరసన నటించిన సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొన్నాయి. అయితే.. ఈ సినిమాలన్నీ పలు ఓటీటీల ద్వారా విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్ల సినిమాలు ఓటీటీల ద్వారా రిలీజ్ అయినప్పటికీ.. ఒకేసారి మూడు సినిమా ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్న ఏకైక హీరోయిన్ మాత్రం రకుల్. ఈ రకంగా ఆమె సరికొత్త రికార్డ్ సృష్టించడమే కాక మరోమారు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus