Ram Charan: నాకు అవకాశం ఉంటే ఆ క్వాలిటీని అప్పుగా తీసుకుంటా.. రామ్ చరణ్

టాలీవుడ్ లో నేటి తరం మాస్ హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో ముందుగా మనకి వినిపించే రెండు పేర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడుతూ వచ్చిన నందమూరి మరియు మెగా ఫ్యామిలీ కుటుంబాల నుండి వచ్చిన నేటి తరం స్టార్ హీరోలు అవ్వడం తో వీళ్ళ మధ్య నిజ జీవితం లో కూడా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ పగలు ఉన్నాయని అనుకోవచ్చు.

కానీ నిజ జీవితం లో వీళ్లిద్దరి మధ్య ఉన్నంత స్నేహం టాలీవుడ్ లో ఏ ఇద్దరి హీరోల మధ్య కూడా లేదు అనడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు. అందుకే వీళ్ళ కాంబినేషన్ లో ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కి, 1300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి , హాలీవుడ్ వరకు వెళ్లి ఆస్కార్ అవార్డుని గెలుచుకునేలా చేసింది.

ఇది ఇలా ఉండగా ఒకప్పుడు రామ్ చరణ్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ నుండి మీరు మీలో ఆ క్వాలిటీ ఉంటే బాగుండేది అని దేనిని చూస్తే అనిపిస్తుంది అని యాంకర్ అడగగా, దానికి రామ్ చరణ్ సమాధానం ఇస్తూ ‘ఎన్టీఆర్ లో అంతులేని ఎనర్జీ ఉంది, అది ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ అర్థం కాదు. అంత ఎనర్జీ అయితే నాలో లేదు, అవకాశం వస్తే ఎన్టీఆర్ నుండి ఆ ఎనర్జీ ని నేను అప్పుగా తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు.

రామ్ చరణ్ (Ram Charan) ఇచ్చిన ఈ సమాధానం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. ఆయన అభిమానులు మాత్రం దీనిని ఏకీభవించలేదు. ఎన్టీఆర్ లో మంచి ఎనర్జీ ఉంది, దానిని మేము కాదనము, కానీ నువ్వు ఎన్టీఆర్ కి ఏమాత్రం తీసిపోవు అన్నయ్యా, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేసారు ఫ్యాన్స్.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus