Allu Arjun, Ram Charan: చరణ్ కు ఆ హోదా దక్కినట్టేనా?
- September 19, 2021 / 04:26 PM ISTByFilmy Focus
స్టార్ హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకముందే పాన్ ఇండియా హీరోగా మారిపోయారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరైన రామ్ చరణ్ తరువాత సినిమా శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. సినిమా ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తూ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ తాజాగా డిస్నీ + హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన యాడ్ షూటింగ్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ యాప్ కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడం అతని కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు బన్నీ ఆహా ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారనే విషయం తెలిసిందే. అయితే ఆహాతో పోలిస్తే హాట్ స్టార్ కు రీచ్ ఎక్కువగా ఉండటంతో చరణ్ బన్నీపై పై చేయి సాధించారనే చెప్పాలి. మరోవైపు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటైన సువర్ణభూమితో రామ్ చరణ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ కంపెనీకి చెందిన యాడ్స్ లో కూడా రామ్ చరణ్ కనిపించనున్నారు. ప్రస్తుతం చరణ్ ఆచార్య పెండింగ్ వర్క్ ను పూర్తి చేసి శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నారు. ఆచార్య రిలీజ్ డేట్ గురించి అతి త్వరలో క్లారిటీ రానుందని తెలుస్తోంది.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!
















