తండ్రి కాబోయే విషయంపై స్పందించిన రామ్ చరణ్ తేజ్
- December 19, 2016 / 01:49 PM ISTByFilmy Focus
ఒక శుభవార్త కోసం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు, మెగా అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు. అదే రామ్ చరణ్ తేజ్ తండ్రి అయ్యే వార్త. చెర్రీ నాలుగేళ్ల క్రితం తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే భార్య భర్తల నుంచి తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోవడం కోసం మాత్రం ఈ దంపతులు తొందర పడలేదు. ఈ విషయమే మెగాస్టార్ కోడలు ఉపాసనను అడగగా ..”కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం.. అది పూర్తి అయినా తర్వాత పిల్లల్ని ప్లాన్ చేస్తాం” అని వివరించారు. “ఇప్పుడే కస్టపడి బరువు తగ్గాను.. మళ్ళీ బరువు పెరగమంటే ఎలా? ..” అంటూ చమత్కరించారు.
కచ్చితంగా ఇప్పుడు అని చెప్పలేదు. ఇక ధృవ సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ ముందు ఈ ప్రశ్న ఉంచగా “ఇంకా నేను చిన్నపిల్లవాడిని. ఇప్పుడే నన్ను నేను హ్యాండిల్ చేసుకుంటున్నాను” అంటూ నవ్వుతూ దాటవేయడానికి ప్రయత్నించారు. కానీ చివరికీ తనకి పిల్లలంటే ఇష్టమని, తండ్రిగా ఆ ఫీలింగ్ ని అనుభవించాలని అనుకుంటున్నట్లు వివరించారు. త్వరలో ఆ శుభవార్త చెబుతానని వెల్లడించారు. అయితే మెగాస్టార్ మూడో తరం హీరోని చూసే తరుణం ఎంతో దూరం లేదన్న మాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















