Ram Charan, Bachibabu: బుచ్చిబాబును నమ్మి అన్ని రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుండగా బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు కావడం, ఉప్పెన సినిమాతో ఇప్పటికే బుచ్చిబాబు ప్రూవ్ చేసుకోవడంతో చరణ్ బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చారు. బుచ్చిబాబు చెప్పిన కథ కూడా కొత్తగా ఉండటంతో పాటు ఎన్టీఆర్ కు కూడా నచ్చిన కథ కావడంతో చరణ్ మరో ఆలోచన లేకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీని కొత్త నిర్మాతలు నిర్మిస్తుండగా ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను నిర్మించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో దేశవిదేశాల్లో చరణ్ మార్కెట్ భారీగా పెరిగిన నేపథ్యంలో మేకర్స్ ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడకూడదని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే బుచ్చిబాబును నమ్మి 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దర్శకులు సెకండ్ మూవీతో నిరాశపరిచిన సందర్భాలు సైతం ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు చరణ్ సినిమాతో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. చరణ్ సినిమాతో సక్సెస్ సాధిస్తే బుచ్చిబాబు కూడా పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఉప్పెన సినిమాతో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న బుచ్చిబాబు

తర్వాత సినిమాలతో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బుచ్చిబాబు ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే ఇతర భాషల హీరోలు సైతం బుచ్చిబాబుతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పవచ్చు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus