గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజా ప్రాజెక్ట్ ‘RC 16’ (RC16 Movie) పనుల్లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ కలిగి పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. మైసూర్‌లో జరిగిన తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రత్యేకంగా మొదలైన విషయం అందరికి ఆసక్తిగా మారింది. సాధారణంగా యాక్షన్ లేదా పాటలతో షూటింగ్ మొదలుపెట్టే బుచ్చిబాబు, ఈసారి కామెడీ సన్నివేశాలతో ప్రారంభించారట. ఈ షెడ్యూల్‌లో చరణ్‌తో పాటు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , సత్య (Satya) , చమ్మక్ చంద్ర (Chammak Chandra) , జాన్ విజయ్ (John Vijay) వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
జాన్ విజయ్ తన ప్రత్యేకమైన కామెడీ విలన్ పాత్రలతో అందరికీ గుర్తుండిపోయారు. చరణ్ చుట్టూ ఈ కామెడీ గ్యాంగ్ ని తీసుకొచ్చి, కథలో కీలకమైన కామెడీ ట్రాక్‌ను మొదలుపెట్టడం వెనుక బుచ్చిబాబు ప్రత్యేకమైన ప్లాన్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్ తన గత ఇంటర్వ్యూలో, ఈ సినిమాలో కామెడీ ప్రధాన ఎలిమెంట్‌గా ఉంటుందని హింట్ ఇచ్చారు. బుచ్చిబాబు ఈ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్‌ను ఈ షెడ్యూల్‌లో హైలెట్ చేసి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారట.
రామ్ చరణ్ కూడా ఉత్తరాంధ్ర నేటివిటీకి సరిపడే స్లాంగ్ నేర్చుకుంటున్నారని సమాచారం. హ్యూమర్ తో పాటు సీరియస్ డ్రామా మిక్స్ చేస్తూ ఈ సినిమాను కొత్తగా మలచే ప్రయత్నం జరుగుతోందట. ఈ సినిమా కథ కోసం ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రత్యేకంగా పాత్రల కోసం ఆడిషన్స్ నిర్వహించి, వారికి చాన్స్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో గొప్ప విలేజ్ సెట్ వేసి, అక్కడే కథను సజీవంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బుచ్చిబాబు, ఉప్పెన (Uppena) విజయంతో తన టాలెంట్ ను నిరూపించుకున్న తరవాత, ఈ సినిమాలో మరో డిఫరెంట్ జోనర్‌లో తన ప్రతిభ చూపించబోతున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం ‘RC 16’పై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల అవుతుందని భావిస్తున్నారు.