స్టార్ హీరో రామ్ చరణ్ తొలి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చినా రాజమౌళి మాత్రం రెండో సినిమాకు దర్శకత్వం వహిస్తానని చిరంజీవికి మాటిచ్చి మగధీరకు దర్శకత్వం వహించారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మగధీర తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా రాజమౌళి చరణ్ కాంబోలో తెరకెక్కింది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రాజమౌళి సినిమాలో నటించడం గురించి చరణ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. రాజమౌళి డైరెక్షన్ లో పని చేయడం తన అదృష్టమని చరణ్ కామెంట్లు చేశారు.
నటులుగా సంవత్సరం సంవత్సరానికి మనం డెవలప్ అవుతుంటామని గడిచిన పది సంవత్సరాలలో చాలా మార్పు వచ్చిందని చరణ్ పేర్కొన్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి సైతం గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందారని చరణ్ చెప్పుకొచ్చారు. రాజమౌళి క్లారిటీ ఉన్న డైరెక్టర్ అని రాజమౌళి లాంటి డైరెక్టర్లతో వర్క్ చేసే సమయంలో మన వర్క్ సులభమవుతుందని చరణ్ కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని చరణ్ ఆశాభావం వ్యక్తం చేయడంతో పాటు థర్డ్ వేవ్ నుంచి బయటపడి ఈ మూవీ రిలీజవుతుందని కామెంట్లు చేశారు.
ఆలోచనా విధానంలో క్లారిటీ ఉండే డైరెక్టర్ తో పని చేస్తే లక్కీ అని అలాంటి డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఒకరని చరణ్ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని చరణ్ అన్నారు. స్టార్స్ నటించడం వల్ల సినిమాలకు రావడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తారని చరణ్ వెల్లడించారు. భారీ బడ్జెట్ సినిమాల వల్ల ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని చరణ్ కామెంట్లు చేశారు.
చరణ్ ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ ను పెంచుకుని సత్తా చాటాలని అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్ ఆశ నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు సినిమాలో సమానంగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. చరణ్ శంకర్ సినిమా పనులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!