రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి లాంటి ఇండియా లెవెల్ ఆల్ టైమ్ హిట్ తరువాత రాజమౌళి చేస్తున్న మూవీ కావడంతో పాటు.. టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ స్టార్స్ చేస్తున్న మల్టీ స్టారర్ కావడం కూడా మరో కారణం. తెలుగు ప్రాంతాలకు చెందిన ఇద్దరు ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలకు కాల్పనికత జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మూడు వందల కోట్లకు పైగా ఖర్చుతో నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 30న విడుదల చేయనున్నట్లు… మూవీ ప్రకటన రోజే తెలియజేశారు రాజమౌళి. ఐతే అనేక మార్లు వివిధ కారణాలతో చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. రాజమౌళి అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్ర షూటింగ్ సాగలేదు. దీనితో ఈ మూవీ అనుకున్న విధంగా జులై 30న విడుదలయ్యే అవకాశం లేదని ప్రచారం జరిగింది. దీనితో ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ 70శాతం పూర్తయ్యిందంటూ, చిత్ర యూనిట్ పరోక్షంగా పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఐతే ఒక సినిమాను ఏళ్ల తరబడి చెక్కే జక్కన్న ఈ మూవీని అనుకున్న సమయానికి విడుదల చేస్తాడని ఎవరూ భావించడం లేదు.
కాగా ఆర్ ఆర్ ఆర్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ఈ చిత్ర విడుదల పై స్పష్టత ఇచ్చారు.ఓ మొబైల్ షో రూమ్ ప్రారంభోత్సవానికి నేడు విజయవాడ వచ్చిన రామ్ చరణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వారిలో ఒకరు ఆర్ ఆర్ ఆర్ విడుదల ఎప్పుడు ఉంటుంది అని అడుగగా..ఖచ్చితంగా సమ్మర్ కానుకగా విడుదల చేస్తాం అని చెప్పారు.సమ్మర్ అంటే ముందుగా చెప్పిన విధంగా జులై 30న వస్తుందని అర్థం. మరి చూడాలి ఆర్ ఆర్ ఆర్ చరణ్ చెప్పిన విధంగా ప్రకటించిన తేదికి విడుదల అవుతుందో లేదో.
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!