సంక్రాంతి సినిమాలకు శుభాకాంక్షలు చెప్పిన చరణ్

ఒక 20 ఏళ్ల క్రితం వరకూ హీరోలందరూ సరదాగా కలిసే ఉండేవారు. అప్పట్లో ఒకేరోజు వాళ్ళ సినిమాలు ఒకేరోజు రెండుమూడు విడుదలైనా ఆ పోటీని ఆనందంగా ఆస్వాదించేవారు. కానీ… గత పదేళ్లుగా ఇంటర్నెట్, సోషల్ మీడియా, కుల రాజకీయాలు సినిమాలోని ఎంటర్ టైన్మెంట్ ను టేకోవర్ చేయడంతో ఆ స్థానంలో ఆదిపత్యం వచ్చి చేరింది. ఇక ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాన్ వార్స్ పుణ్యమా అని ఆఖరికి హీరోలు ఈ ఫ్యాన్ వార్స్ కి తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే.. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. హీరోలు వర్గ బేధాలను పక్కనపెట్టి కలిసిమెలిసి మెలుగుతున్నారు. ఈ లిస్ట్ లో ఇటీవల కాలంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబులు జాయినై ఫ్యాన్ వార్స్ కి స్వస్తిపలకడానికి ప్రయత్నించారు కానీ.. పెద్దగా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ.. రామ్ చరణ్ ఈ సంక్రాంతికి తన “వినయ విధేయ రామ”తోపాటుగా విడుదలవుతున్న “ఎన్టీఆర్ కథానాయకుడు, ఎఫ్ 2” సినిమాల గురించి తాను చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నానని. తన సినిమాతోపాటు వారి సినిమాలు కూడా సూపర్ సక్సెస్ సాధించాలని రామ్ చరణ్ కోరుకోవడం విశేషం. ఈ స్పోర్టివ్ నెస్ మన హీరోలలో మాత్రమే కాక వాళ్ళ అభిమానుల్లో కూడా ఉంటే బాగుండేది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus