Ram Charan: అలా చేస్తే మెగా పవర్ స్టార్ కు అస్సలు నచ్చదట.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ తండ్రికి తగ్గ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. స్టార్ హీరో చరణ్ పారితోషికం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. నిర్మాతలను చరణ్ అస్సలు ఇబ్బంది పెట్టరని సినిమాకు నష్టం వస్తే రెమ్యునరేషన్ ను వెనక్కిచ్చే హీరోలలో రామ్ చరణ్ ఒకరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రామ్ చరణ్ (Ram Charan) డ్యాన్స్ లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే రామ్ చరణ్ డ్యాన్సింగ్ స్కిల్స్ కు సంబంధించి షాకింగ్ విషయం వెల్లడైంది. రామ్ చరణ్ కు ఏదైనా సాంగ్ కు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం అంటే అస్సలు నచ్చదట. డ్యాన్స్ ప్రాక్టీస్ ను ఈ టాలీవుడ్ స్టార్ హీరో టైమ్ వేస్ట్ అని భావిస్తాడట. సాంగ్ షూట్ సమయంలో కొరియోగ్రాఫర్ డ్యాన్స్ స్టెప్స్ ను చూపిస్తే అలవోకగా రామ్ చరణ్ ఆ స్టెప్స్ ను చేసేస్తాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా చేస్తారట. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ కాగా కఠినమైన స్టెప్స్ ను సైతం అలవోకగా వేయడం ద్వారా ఈ హీరోలు వార్తల్లో నిలుస్తున్నారు. చరణ్, తారక్ కాంబినేషన్ ను డైరెక్టర్లు ఎవరైనా రిపీట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్, తారక్ ఈ మధ్య కాలంలో కలిసి కనిపించకపోయినా అవసరం ఉన్న ప్రతి సందర్భంలో ఒకరికొకరు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ ఇద్దరు హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఈ ఇద్దరు హీరోల సినిమాలకు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. చరణ్, తారక్ భవిష్యత్తు సినిమాలతో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus